అమ్మ హితోక్తులు:- --గద్వాల సోమన్న ,9966414680
మొక్కలాగ జీవితాన
మౌనంగా ఎదగాలి
చుక్కలాగ ప్రపంచాన
ఉన్నతంగా వెలగాలి

చిగురులాగ జనుల మధ్య
వినయంగా బ్రతకాలి
తరువులాగ పదిమందికి
గొప్పగా సాయపడాలి

గురువులాగ బుర్రలో
అజ్ఞానం దులపాలి
విజ్ఞాన జ్యోతి వెలిగించి
బ్రతుకు బాగు చేయాలి

మిత్రునిలాగ ఆపదలో
కొండలా అండ ఉండాలి
దండంలోని దారంలా
ఆధారం కావాలి

పాపలాగ చిరునవ్వులు
పువ్వులాగ రువ్వాలి
అధరాల గగనంలో
వెన్నెల్లా కురియాలి


కామెంట్‌లు