విలువైనది ధ్యానము:- --గద్వాల సోమన్న ,9966414680
ప్రతి రోజూ ధ్యానము
చేస్తేనే లాభము
మానసిక ఒత్తిడిని
గెలుచుటకిది మార్గము

మనసులోని అలజడి
చేయునోయి కట్టడి
దుర్గుణాలను దిద్ది
బాగు చేయు నడవడి

విలువైనది ధ్యానము
చేసుకున్న క్షేమము
పెంచును ఆరోగ్యము
పంచును ఆనందము

ధ్యానమే అద్భుతము
మార్చునోయ్! జీవితము
క్రమం తప్పకుండా
చేయాలోయ్! దినదినము


కామెంట్‌లు