కుంభమేళ:- ఉండ్రాళ్ళ రాజేశం -సిద్దిపేట -9966946084
 సాధు జనుల సంగమం
 జనుల బాటల సాగరం
 కోట్ల కొలువుల క్షేత్రమై
 గంగ జలముల తానములు 
 సాగుతుండెను ప్రయాగన 
 కుంభమేళన సందడై
 కష్ట సుఖముల కలయిక 
 కదులుతున్నది భారతము
 పుణ్యఫలముల సాధనై
 సాగుతున్నది కుంభమేళ
 తరలి చూడను సాధ్యము
 కదులుతుండిరి నలుదిక్కులై 
 కలిసె చోటు ప్రయాగగా
 కుంభమేళా ఘనముగా 
 ఖ్యాతి నొందును జగతిన




కామెంట్‌లు