మధుగీతిక 10వ తరగతి చడువుతున్నది. ఎన్నడూ లేనిది క్లాస్ మేట్స్ అందరినీ పిలిచింది. అందరూ వచ్చారు. రకరకాల పండ్ల రసాలను ఇచ్చింది. వినోద కార్యక్రమాలను నిర్వహించింది. అంత్యాక్షరి పద్యాలు మరియు పాటల పోటీ, రకరకాల వినోదాత్మక గేమ్స్ నిర్వహించింది. గెలిచిన వారికి బహుమతులను ఇచ్చింది. రాత్రి రక రకాల రుచికరమైన కూరలతో భోజనం పార్టీ ఇచ్చింది ఆ తర్వాత అసలు విషయం చెప్పింది. ఈ రోజు తన పుట్టినరోజు అని ఆ సందర్భంగా రొటీన్ కి భిన్నంగా ఆరోగ్యకరమైన పార్టీ ఇచ్చాను అని చెప్పింది. అందరూ "హ్యాపీ బర్త్ డే టు యు" అని చెప్పారు.
కేకులు కట్ చేయడం వంటి రొటీన్ కి భిన్నంగా ఆరోగ్యకరమైన పార్టీ ఇవ్వాలనే ఆలోచనతో ఇలా ఏర్పాటు చేశానని చెప్పింది. కూల్ డ్రింక్స్ తీయని విషం అని, అవి ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బ తీస్తాయని, షాపులలో దొరికే చిరుతిండ్లు కూడా మంచివి కావని చెప్పింది. "ముందే చెపితే గిఫ్ట్స్ తీసుకుని వచ్చేవాళ్లం కదా!" అన్నారు మిత్రులు. "నాకు బహుమతులు ఇప్పుడు ఇవ్వొద్దు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మీరంతా మరింత మంచి మార్కులు తెచ్చుకోవాలి. అదే నాకు మీరిచ్చే పెద్ద గిఫ్ట్." అన్నది మధుగీతిక. "ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకుంటాం." అన్నారు అంతా.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి