ప్రేమ: - కోరాడ నరసింహా రావు
ఆ ప్రేమని యేమని వర్ణిం చను..! 
    దేనితో సరిపోల్చగలను 
  ఎలా నిర్వచించ గలను!! 

పంచిన ఆ ప్రేమకి... 
   చూపించిన ఆ అనురాగానికీ, 
    బదులేమీయ గలను! 
నేనిష్టముగా తింటే, తన కడుపు నిండి పోయినంత ఆనందం..! 
     నేను యే కాస్త కలత చెందినా... 
    తన ముఖంలో చెప్పలేని బాధ..! 
    నా సుఖముకోసం... 
నా ఆనందం కోసం... 
   నిరంతరం తను ఎంత పరి తపించేదని... 
    తన ఆనందాలనెన్ని త్యాగం చేసిందని...
  తన బ్రతుకునే, నాకోసం నా సుఖ, సంతోషాలకోసం

 నా ఆనందం కోసమే... బ్రతికిన త్యాగమూర్తి...! 
  ప్రేమంటే ఆమెదే...! 
  ఆ ప్రేమను మించిన ప్రేమ
 ప్రపంచంలో ఇంకేదైనా ఉంటుందా...?! 
   నన్ను రోగాలు పీడించిన ప్పుడల్లా 
ఆమెకు నిద్రలేని రాత్రు లెన్నో..., 
చిక్కి, శల్య మైపోయేది...! 
  ప్రేమకు సేవ,త్యాగములే 
 నిర్వచనములుగాబ్రతికిన మా అమ్మను చూసే నేర్చు కున్నా
... ఎదుటి మనిషిని ప్రేమించటము, సేవించట ము...! 
   అమ్మా... నీ ప్రేమ నిర్మలము,నిష్కల్మషము! 
  అమ్మా ఏమిచ్చినా.... 
   తీర్చుకోలేని నీ రుణాన్ని 
మరు జన్మలో నీకుఅమ్మనై తీ ర్చు కుంటా...! 
        ******
కామెంట్‌లు