జీవన వాహినిలో
చైతన్యానికి ఆశే మూలం!
గాలివాటున సాగే
బ్రతుకు రథం నడిపే
సారథి రేపటిపై ఆశే!
విసుగెంత కలిగినా
వినిపించుకోక
విధికి ఎదురు పోలేక
విరామమే లేక సాగేదే
జీవనపోరాటం!
దారులన్నీ సుగమం కాదు
పోరులన్నీ విజయం కావు
పేరుకున్న కోరికలెన్నో
ఊరుతున్న ఊహలెన్నో
చేరుకునే తీరం ఏదో!
తొలి అడుగు వేసాకే
తొలగు చీకటి
మలి అడుగుకు అదే కాదా
తెగువ నిచ్చే బాసట!
తేరిపార చూడనివ్వని
కాలపు వేగంలో
కరిగి జారిపోతూ
తిరిగి చూసే తీరిక
దొరకని జీవితం!
మనసుకు కలిగే సంతోషాలు
కనులకు దొరికే అందాలు
దోసిట పట్టే చిన్ని ఆనందాలే
మూటగా కట్టి మోసుకుపోయే
సిరులు సంపదలు!
ప్రతి క్షణం జీవించే
వరమేదో ఇమ్మని
ప్రతి జీవికీ ప్రతి లేని
ప్రమోదమే కలగాలని
ప్రభాకరుని అర్థిస్తూ....
🌸🌸 సుప్రభాతం 🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి