కవితను నేను :- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కవి మనసు

పొంగును 
కవి తలపుల 
రూపమును  

కవి తోటనందు  
పూచినపువ్వును 
కవి కల్పనల 
ఊహాచిత్రమును  

కవి చల్లిన 
వెలుగును 
కవి కూర్చిన 
కమ్మదనమును 

కవి వండిన 
పంచభక్ష్యాలను 
కవి అల్లిన 
పూమాలను 

కవి కురిపించన 
అక్షరజల్లును 
కవి చల్లిన 
సుమసౌరభమును

కవి పండించిన 
పంటను 
కవి సృష్టించిన
సంపదను

కవి భావనలకు 
అడ్డమును 
పాఠకుల మదులకు 
గాలమును 

కవి కష్టముకు 
ఫలమును 
కవి ఇష్టముకు
ప్రతిబింబమును  

కవి వదిలిన 
బాణమును 
కవి చల్లిన 
తేనేచుక్కలను

కవి పెదవుల 
సుధను 
కవి నోటి 
వాక్కును

కామెంట్‌లు