కోనల దాగిన కొత్త కొమ్మకు
కొనలో కూచున్న పిట్ట
కనులకు వెలుగును నింపే
కిరణపు రాక ఎరుకే! ఎలా?
రెమ్మను పుట్టిన ఎర్రని
చిగురుటాకు పై కదిలే
పసిపాపల బుగ్గల మెరుపు
కనిపించే వింత... ఎలా?
చూపుకు అందని లోతున
సాగే సెలయేరు పాడే రాగం
జలతారు జిలుగులు అద్దే
తెలవారి వెలుగుకు తెలుసు.. ఎలా?
రేయిని కురిసిన మంచుకు
వణికిన తరువుకు వెచ్చగా
తాకి వేడిని పుట్టించడం
వెలుగులరేడుకే తెలుసు.. ఎలా?
నలిగిన దారిలో అణగి
పగిలిన మనసున
తగిలిన గాయాలను
మాన్పే మంత్రం రేపుకే తెలుసు.. ఎలా?
సాగే జీవిత పయనంలో
మూగే కలతల చీకటిని
తరిమే కాంతిరేఖల ఆప
తరమా ఎవ్వరికైనా?
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి