అత్యాశ ఫలితం: సరికొండ శ్రీనివాసరాజు
    రంగ వాళ్ళ ఇంటికి వాళ్ళ మేనమామ పరమేశు వచ్చాడు. మేనమామతో చాలా కబుర్లు చెప్పాడు రంగ. చదువులో తాను ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ అని, క్రమశిక్షణలో ఉపాధ్యాయులు ఎప్పుడూ తనను మెచ్చుకుంటారని గొప్పలు చెప్పుకున్నాడు. చదువుతో పాటు సత్ప్రవర్తన చాలా ముఖ్యం అని చెప్పాడు మామయ్య పరమేశం.
      ఒకరోజు మామయ్య తనకు అవసరం అయిన వస్తువుల లిస్ట్ రాసి, డబ్బులు ఇచ్చి, షాపులో కొనుక్కొని రమ్మన్నాడు. రంగ కొనుక్కొని వచ్చి మామయ్యకు చిల్లర ఇచ్చాడు. రంగ అటువైపు వెళ్ళగానే రంగ అక్క స్రవంతి వచ్చి "మామయ్యా! మిగిలిన డబ్బులు సరిగా ఇచ్చాడా?" అని అడిగింది. "నీకు నీ తమ్ముడు మీద ఎంత నమ్మకం తల్లీ! నీ తమ్ముడికి మేనమామగా ఒక 1000 రూపాయలు గిఫ్ట్ గా ఇద్దామని అనుకున్నా. కానీ నేను అవసరమైన వస్తువుల కోసం డబ్బులు ఇస్తే అయిన ఖర్చు కంటే చాలా ఎక్కువ చెప్పి తక్కువ చిల్లర ఇచ్చాడు. పాకెట్ మనీ అడిగితే ఇవ్వనా? కాబట్టి నేను గిఫ్ట్ మనీ ఇచ్చే ఆలోచన విరమించుకున్నా." అన్నాడు. 
     ఈ మాటలు చాటుగా విన్న రంగ సిగ్గు పడ్డాడు. తన గురించి అతిగా చెప్పుకున్నాడు. ఇపుడు మేనమామ ముందు పరువు పోయింది. తన అత్యాశ వల్ల రాబోయే గిఫ్ట్ మనీ ఆగిపోయింది.

కామెంట్‌లు