తెలుసుకుందాం! :- సేకరణ..--అచ్యుతుని రాజ్యశ్రీ

 మనకు కష్టం బాధ కల్గగానే ముందుగా దేవుని నిందిస్తాం.పూజలు కొబ్బరికాయలు కొడ్తున్నా దుఃఖం బాధతో విలవిలలాడుతున్నాం అని అనుకోటం సహజం.మన సంచిత ప్రారబ్ధ కర్మలు కారణంఅని అనుకోటం ఉత్తమం.ఓవ్యక్తి రోడ్డుపైన అరటితొక్క పై కాలేసి జర్రున జారి  వెంటనే లేవగలిగాడు. మోచేయి దోక్కుపోయింది. "నేను గుడికెళ్లి వస్తుంటే కింద పడేశాడు దేవుడు" అని  తన దగ్గర కొచ్చినవాడితో అంటే" నయం!వాహనాల కింద పడి తల పగలలేదు కదా!దైవం కాపాడాడు కదా!?" అనగానే సిగ్గుపడ్డాడతను. నిజమే కదూ ?హడావిడి తొందరపాటుతో కష్ట నష్టాలు తప్పవు.అందుకే వాహనప్రమాదాలు హాహాకారాలు.అతి వద్దు.ధర్మరాజుకి వ్యాసుడు చెప్పిన కథ ఇది.మేథాతిథి అనే మునికి కోపం తొందరపాటు ఎక్కువ. ఓరోజు భార్య మీద కోపంవచ్చి కొడుకు చిరకారి ని ఆజ్ఞాపించాడు" ఆమెను చంపు" అనేసి బైటకెళ్లిపోయాడు. ఆపిల్లాడు ఆలోచనలో ఉన్నాడు.ఆవెంటనే కోపంతగ్గిన ముని వచ్చాడు.చిరకారుడు కత్తిని కింద పడేసి నిలబడి ఉండటం చూసి పెద్దగా ఏడుస్తూ భార్య పిల్లాడ్ని గుండెకు హత్తుకున్నాడు.పరశురాముడు ఆవేశంతో తల్లి శిరస్సు ఖండించాడు తండ్రి ఆజ్ఞపై! కానీ ఆమెను తిరిగి బ్రతికించాడు. ఇంటాబైట కోపంవస్తే మనం అరిచి పోట్లాడితే మనకే నష్టం.దుర్వాసుడు మహాకోపిష్టి ముని అని అందరికీ తెలుసు.అనసూయ పుత్రుడు.ఈయనను గూర్చి చాలా కథలున్నాయి. ఒకసారి బ్రహ్మ శివునికి మాటామాటా వచ్చింది.శివుడు కోపంతో చిందులేస్తుంటే పార్వతి ప్రార్ధించింది" దుర్వాసంభవతిమి_మీతో కాపురం కష్టంగా ఉంది స్వామీ". అప్పుడు శివుడు తన కోపాన్ని అనసూయ లో పెట్టాడు. అలా అనసూయాదేవికి బ్రహ్మ అంశంతో చంద్రుడు విష్ణువు అంశతో దత్తాత్రేయుడు  శివాంశతో ధుమధుమలాడే దుర్వాసుడు జన్మించారు🌹
కామెంట్‌లు