విద్యార్థులు ఆసక్తితో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ధర్మారం మండల విద్యాధికారి ప్రభాకర్ అన్నారు. మాతృభాష దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సింహులపల్లిలో విద్యార్థులు రాసిన "పల్లెటూరి పిల్లగాండ్లు" పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటినుండే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా చదవాలని, పదవ తరగతి విద్యార్థులు శ్రద్ధగా చదివి మంచి మార్కులు పొందాలని సూచించారు. విద్యార్థులు ఏ విషయాన్నైనా అసక్తితో నేర్చుకుంటే ఉత్తమ ఫలితాలు పొందవచ్చని అందుకు నిదర్శనమే నర్సింహుల పల్లె బడిపిల్లలు రాసిన 'పల్లెటూరి పిల్లగాండ్లు' ఆత్మకథల పుస్తకమని అన్నారు. పాఠశాలకు చెందిన19 మంది విద్యార్థులు రాసిన ఆత్మకథలను తెలుగు ఉపాధ్యాయుడు కందుకూరి భాస్కర్ పుస్తకరూపంలో తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ఈ పల్లెటూరి పిల్లగాండ్ల పుస్తకాన్ని ప్రముఖ సాహితీవేత్త, తెలుగు ఉపన్యాసాకులు ఎర్రోజు వెంకటేశ్వర్లు పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు బొజ్జ నరేందర్ అధ్యక్షత వహించగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ రజిత మల్లేశం తో పాటు పుస్తక సంపాదకులు కందుకూరి భాస్కర్ ఉపాధ్యాయులు రమేష్, పుష్పలత, శ్రీనివాస చక్రవర్తి, రాం చంద్రారెడ్డి, సతీష్ కుమార్, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
పల్లెటూరి పిల్లగాండ్లు పుస్తకావిష్కరణ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి