తెలుసుకుందాం! సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం ఎన్నో పదాలు తప్పుగా వాడుతున్నాం.పూజారి అంటే అది అంటే శత్రువు పూజకు శత్రువు అనే అర్థం వస్తోంది! పురోహితుడు ఆలయంలో అర్చకులు అని వాడాలి.భారతోపనిషత్ అంటే మహాభారతంలో ఆదిపర్వంలో 122 శ్లోకాల అనుక్రమణికా పర్వం.వేదవ్యాసుడు కౌరవ పాండవులను రెండు మహావృక్షాలతో పోల్చాడు. దుర్యోధనుడు క్రోధ రూపమైనవృక్షం. కాండం కర్ణుడు.కొమ్మలు శకుని.కౌరవులంతా పూలు పళ్లు. ధృతరాష్ట్రుడు వేళ్లు.ధర్మ రాజు ధర్మ రూపంలోఉన్న మహావృక్షం. మొదలు అర్జునుడు కొమ్మలు భీముడు. నకులసహదేవులు పూలు పండు.శ్రీకృష్ణుడు వృక్షంకి వేళ్లు.పిచ్చి చెట్టుని ఆదిలోనే నరికి మంచివృక్షాలను పెంచాలి.మొక్కై వంగనిది మానై వంగదు.బాల్యంలోనే మంచి విత్తులు నాటాలి.యశోద నందుల పూర్వజన్మ వృత్తాంతం ఇది.దేవతా వర్గం లో అష్టవసువులు ఒకరు.ద్రోణుడనే వసువు ఆయన భార్య  ధర.బ్రహ్మ అనుగ్రహంతో వారుయశోద నందగోపులుగా పుట్టారు.కృష్ణుడు వారి ముద్దులపట్టిగా పెరిగాడు.అంతరార్థం చూద్దాం.భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం మనసు బుద్ధి అహంకారం అష్టవసువులు.అహంకారం పోతే దైవం దక్కుతాడు.🌹
కామెంట్‌లు