సైన్స్ అనేది అభివృద్ధికి సంకేతం

 సైన్స్ అనేది వెనుకబాటు నుండి అభివృద్ధి దిశగా పయనించే సంకేతమని పాతపొన్నుటూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు అన్నారు. విజ్ఞాన శాస్త్రవేత్త సి.వి.రామన్ కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్, నేడు అమలులోకి వచ్చిన సందర్భంగా 
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో ఏర్పరిచిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన వైద్యం అందక మన పూర్వీకులు అసువులు బాసిన దుస్థితి నుంచి, అన్ని రకాల వ్యాధులను నిర్మూలించేలా గొప్ప ఔషదాలను, శస్త్రచికిత్సలను, సాంకేతిక పరిజ్ఞానంతో చేసే ప్రయోగాలను అందజేసింది ఈ సైన్స్ అని ఆయన అన్నారు. ఈనాటి సైన్స్ డే వేదికపై పాఠశాలలో సైన్స్ పాఠాలు బోధిస్తున్న గుర్రాల కృష్ణారావు, పైసక్కి చంద్రశేఖరం, బూడిద సంతోష్ కుమార్ లను ఉపాధ్యాయులు, విద్యార్థులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అలాగే సైన్స్ ప్రోజెక్ట్ వర్క్స్ లో మిక్కిలి ప్రతిభ కనబర్చుచున్న ఎనిమిదో తరగతి విద్యార్థిణి అందవరపు హిమబిందుకు జ్ఞాపికను బహూకరించి సత్కరించారు. 
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు, ఉపాధ్యాయులు అందవరపు రాజేష్, పైసక్కి చంద్రశేఖరం, బూడిద సంతోష్ కుమార్, బొమ్మాళి నాగేశ్వరరావు, కుదమ తిరుమలరావులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం మిఠాయి పంపిణీ చేశారు . .
కామెంట్‌లు