మిల్కీ నాన్న చూడు
నీ పుట్టినరోజు నేడు
కట్ చేయి నీవిక కేకు
నీ వెనకే ఉంది పికాకు !
బంధువులంతా వచ్చిరి
బహుమతుల వారిచ్చిరి
ముంగిట ముగ్గులు వేసిరి
గంధం నీ మెడకు పూసిరి !
నీ పుట్టినరోజు పాట
పాడిరిగా వారి నోట
మెడలో వేసిరి హారం
నీవాడలోని పరివారం !
హ్యాపీ బర్థ్ డే టు యూ
అంటూ అందరూ కలసి
అందిస్తారిక ఆశీర్వాదం
చిందిస్తారులే దరహాసం !
అక్షింతలు నీ తలపై వేస్తూ
పసుపు కుంకుమల నిస్తూ
చేరుతారులే ఇక నీ చెంతా
దీవిస్తారు వచ్చిన వారంతా !
నీ పుట్టినరోజు సాగుతుంది
కన్నుల పండుగై తీరుతుంది
కలుగు అందరిలో ఆనందం
వెలుగు ముందే అనుబంధం
గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.
సెల్.9491387977
నాగర్ కర్నూల్ జిల్లా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి