తెలుసుకుందాం! సేకరణ ..అచ్యుతుని రాజ్యశ్రీ

 మనకు తెలీని కథ ఆశాసాగరుడిది.గాలవుడు అనే మహర్షి యాత్రకు బైలుదేరి ఆశాసాగరుడు అనే ఓగృహస్థు ఇంట్లో బసచేశాడు." నాయనా! నీవు సంసార సాగరములో కొట్టుమిట్టాడుతున్నావు. నీకు మోక్షం వచ్చేలా ఉపాయం చెప్తాను" అన్న ఆయనతో " స్వామీ! నాపిల్లలింకా చిన్న వారు.వారి బాగోగులు చూసి వారు పెద్ద ఐనాక మీతోవస్తాను " అన్నాడు."ఓ 20ఏళ్లు టైం అడిగాడు.అలాగే అని గాలవుడు మళ్లీ వచ్చి " పిల్లలు పెద్ద ఐనారుకదా? ఇప్పటికైన మోక్షం గురించి ఆలోచిస్తావా?" అని అడిగితే" స్వామీ! వారికింకా బాధ్యతలు వంటబట్టలేదు.వారికి అన్నీ అప్పజెప్పి తర్ఫీదు ఇచ్చి వస్తాను" అన్నాడు. ఇలా కొన్నేళ్లుగడిచాక ఋషి ఆవ్యాపారిని అనుగ్రహించాలని వెళ్లాడు.ఆశాసాగరుడు చనిపోయి ఎద్దుగాపుట్టి కొడుకులవల్ల దెబ్బలు తింటూ వ్యవసాయం లో సాయపడుతున్నాడు.ఇలా ఆపిల్లలు ఇంటిపై మమకారంతో దైవ స్మరణ మానేసి కుక్క గా పాముగా ఆఇంట తాను దాచిన ధనాన్ని కాపలాకాస్తున్నాడు.గాలవుడికి అతనిపై జాలేసింది. ఎలాగైనా అతనికి మాయామోహాలు తొలగించాలని పామును చంపమని కుటుంబసభ్యులకు సలహా ఇస్తాడు. ఆపాముని చంపి వారు భూమిలో నిధిని స్వాధీనం చేసుకుంటారు.అలా మితిమీరిన మోహపాశాల్లో ఆశాసాగరుడు సులభంగా వచ్చే మోక్షాన్ని చేతులారా చేజార్చుకున్నాడు. ఇక కలియుగంలో మన బాధ్యత వదిలాక కనీసం సహాయ సహకారాలు ఇతరులకు ధనాపేక్ష లేకుండ అందిస్తూ అనవసర విషయాలను పట్టించుకోకుండా ఉండటం ఉత్తమం. అప్పుడే కీచులాటలు పెత్తనాలకై హోరాహోరీ పోట్లాటలు రావు.సమయానికి తగుమాటలాడి సాధించాలని త్యాగరాజ కీర్తన చెప్పిన తరుణోపాయం అందరికీ అనుసరణీయం. భగవద్గీత లో కృష్ణుడు చెప్పినదికూడా అదే.హనుమంతుడంటే పిల్లల కి మహాఇష్టం. ఆయనలోని సుగుణాలను వారికి వివరించాలి. ప్రతివారికి ధృతి దృష్టి మతి దాక్ష్యం అనేవి ఉండాలి.ధృతి అంటే పట్టుదల. దృష్టి అంటే ప్రలోభాలకు లొంగక అంతిమ లక్ష్యం చేరాలి. మతి అంటే మంచి చెడు విచక్షణ ఏది చెయ్యాలి ఏది చేయకూడదో నిర్ణయించిన తర్వాత అలా మనం పురోగమించాలి. ఇక  దాక్ష్యం అంటే నిగ్రహశక్తి ఉండాలి.సీతాన్వేషణకై హనుమ  నూరు యోజనాలున్న సముద్రంపై  ఎగురుతూ వెళ్లాడు.సురస సింహికల నుంచి తప్పించుకుని లంక చేరాడు.బాల్యం లోనే ఒక లక్ష్యం తో సాగేలా పెద్దలు చూడాలి.అలాగే రాలే వయసు లో కుటుంబ మోహాలు తెంచుకుని తామరాకుపై నీటిబొట్టులా ఉండాలి.పుణ్య కర్మలు చేస్తూ పోవాలి.లాభనష్టాల బేరీజు వేస్తూ ప్రతిదీ డబ్బుతో లంకెపెడ్తూ సహాయం చేయటం ఉపకారం కాదు.అవతలివారికి గూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో మాట సాయంచేసినా చాలు.మనం చేసిన ఉపకారంకి వారినుంచి ఏదో ఆశించడం తప్పు.ప్రకృతియే పెద్ద బాలశిక్ష. 🌹
కామెంట్‌లు