తెల్సుకుందాం!:- అచ్యుతుని రాజ్యశ్రీ

 త్రేతాయుగంలో విశ్వామిత్రుడు గాయత్రీమంత్రాన్ని కనుగొన్నాడు. క్రీ.పూ.5వేల ఏళ్ల కిందట వ్యాసుడు మహాభారతాన్ని వినాయకునిచేత హిమాలయాల్లో రాయించాడు.
లీలాశుకుడు " శ్రీకృష్ణ కర్ణామృతం" రాశాడు.లీలాశుకుడంటే విలాసాలచిలక అని అర్ధం.పూర్వాశ్రమంలో ఆయన బిల్వమంగళుడు. చింతామణి అనే వేశ్యవలలో చిక్కి తిరిగి ఆమె సలహాపై సోమగిరి అనే గురువునాశ్రయించి కృష్ణ మంత్రోపదేశం పొందాడు.కామవికారాలు కలుగకుండా తన రెండు కళ్లు పొడిచేసుకుంటాడు. ఉపనిషత్తులసారమంతా బృందావనం గోపికాభవనంలో రోలుకి కట్టబడి ఉంది అంటాడాయన.
వ్యాసునికి చాలా పేర్లున్నాయి.కృష్ణ ద్వైపాయనుడు  పారాశరుడు సాత్యవతేయుడు వేదవ్యాసుడు బాదరాయణుడు ఆయన నామాలు.
మనం ప్రకృతిని పాజిటివ్ గా చూస్తే ఆలోచిస్తే మంచిమాటలు వింటే మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది.ఎత్తిపొడుపు వ్యంగ్యమైన మాటలు వింటే మనసు బాధపడుతుంది. అలాంటివారికి చాలా దూరంగా జవాబు ఇవ్వకుండా ఉంటే మేలు.ముఖ్యంగా పరీక్షల టైంలో కొందరు పిల్లలు"ఆపాఠం చదివావా? ఇది చదివావా?"అని ఖంగారు పెడతారు.ఇంట్లో పెద్దలుకూడా తొందర పెట్టి హడావిడి చేస్తే చదివింది మర్చిపోతాం. కాబట్టి మనకృషి మన ప్రయత్నం మనం చేస్తూ దైవంపై భారం వేయాలి.వేదాంత పరంగా చెప్పాలంటే ప్రకృతి లోకంలోసుఖభోగాలు దగ్గర వస్తువులను చూడటం.దూరపు వస్తువులను చూడటమంటే ఆత్మ స్వరూపాన్ని గ్రహించుట  దేవుడిదయ ఆయన దే భారం అనుకోటం నిశ్చింత. అమ్మ నాన్నల ప్రేమ లాలనలో పసిపాప లా ఉన్న అనుభూతి చెందడం.ఆస్థితికి ఎదగడం కష్టం.దాన్నే నేడు కౌన్సిలింగ్ పేరుతో సైకాలజిస్టులు చేస్తున్నారు🌹
కామెంట్‌లు