మరణం ప్రకటించిన సైన్యం!
మరణాన్ని వాగ్దానం చేసిన జనం!!
మరణం మరణం మధ్య
ఒక పెద్ద యుద్ధం!!
ఆకురాలిన శబ్దం
చూపు వాలిన నిశబ్దం
అంతా ఒక రణం
అంతా అకారణం!!
పాదముద్రలు చెరిపేసిన సముద్ర అలలు
గాఢనిద్రను చెరిపేసిన పీడ కలలు!!
అంతా ఒక కర్మ!
అంతా ఒక భ్రమ!!
గాలి కాదు అవి ఊపిరితిత్తులు!
పారే నదులు కాదు అవి రక్త హృదయాలు!!
అంతా ఒక మర్మం!
అంతా ఒక శరీర ధర్మం!!
కళ్ళల్లో కూలిన చిత్రాలు
నీళ్లల్లో కాలిన నిప్పులు
చూపుల్ని శబ్దాల్ని భద్రపరిచిన నాడులు మనుషులు.!!
సూర్యచంద్రులు సృష్టించిన నీడలు మనుషులు!!?
అంతా ఒక విచిత్రం!
అంతా కొంత చింత!!
ప్రకృతి వేలం వేసింది గాలిని
ప్రకృతి ప్రకటన చేసింది నీటికి
కొంటామా!!?
సమానంగా వాడుకుంటామా!!?
అంతా కొంత కృతజ్ఞత!
అంతా కొంత విజ్ఞత!!!!
వాగ్దేవి ఉత్తమ ఉపాధ్యాయినీ
శ్రీమతి మీనా ప్రభాకర్ గారి స్మృతిలో.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి