సీనియర్ సిటిజన్స్ ఆత్మీయ సమ్మేళనంలో "కావ్యసుధ"కు ఘన సన్మానం
  శ్రీ వినాయక నగర్ సీనియర్ సిటిజన్ సొసైటీ, వినాయక నగర్ కాలనీ నివాసుల సంక్షేమ సంఘం హయత్ నగర్ సంయుక్త ఆధ్వర్యంలో 29 సంఘాల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం వినాయక నగర్ కాలనీ కళ్లెం పెంటారెడ్డి కమ్యూనిటీ హాలులో ఘనంగా ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భముగా ప్రముఖ సాహితీవేత్త శ్రీ కావ్యసుధ ను శాలువా మెమెంటో తో ఘనంగా సన్మానించగా తన 55 సంవత్సరాల సాహితీ క్షేత్రంలో ఆధ్యాత్మిక సాహిత్య సేవా అనుభవాలను చక్కగా వివరించారు. ప్రముఖుల ఉపన్యాస అనంతరం వివిధ సంఘాలలోని సుమారు 50 మంది వయోవృద్ధులకు సన్మానం జరిగింది
కాలనీ అధ్యక్షులు కళ్లెం శంకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జట్టా మహేశ్వర్, ప్రముఖ కవి శ్రీ. లొడే రాములు మరియు
శ్రీ కొప్పుల నరసింహారెడ్డి, శ్రీ కళ్లెం నవజీవన్ రెడ్డి స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.
సభ అనంతరం ఆత్మీయులతో కమ్మని విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది.

కామెంట్‌లు