తెలుగుతమ్ముళ్ళారా! :- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మీరు తెలుగువాళ్ళా
అయితే తెలుగుతల్లిని పూజించండి

మీకు తెలుగు బాగావచ్చా
అయితే వెలుగులు వెదజల్లండి

మీకు మాతృభాషపై ప్రేముందా
అయితే మీభాషను ప్రోత్సహించండి

మిమ్మల అ ఆలు పిలుస్తున్నాయా
అయితే అక్షరాలను అందంగా అల్లండి

మిమ్మల తేటపదాలు తడుతున్నాయా
అయితే తేటతెల్లముగా కైతలువ్రాయండి

మిమ్ము స్వరాలు గళమెత్తమంటున్నాయా
అయితే చక్కగా కవితాగానము వినిపించండి

మీకు తీపియంటే ఇష్టమా
అయితే తేనెపలుకులు విసరండి

మీకు తెలుగుపై పట్టుందా
అయితే సాహిత్యపయనం సాగించండి

మీరు పక్కా తెలుగోళ్ళా
అయితే మీబాసకు తక్కువచేయకండి

మిమ్మల తోటివారు ప్రోత్సహిస్తున్నారా
అయితే సూక్తులు సుశబ్దాలు శోభిల్లగపలకండి


కామెంట్‌లు