ఓం నమో అర్కాయ నమః...! :- కోరాడ నరసింహా రావు.
 వచ్చు చున్నా డదివొ ఉదయ భాస్కరుండు
  తూర్పుదిక్కున తాను బ్రహ్మ దేవు0డు
   మిట్ట మధ్యానాన విష్ణు వే ఈతడు
   మార్తా0డుడై చెలగి, సాయం సంధ్యకు లయకరుడుగా మారు ! 
 త్రి మూర్తిస్వ రూపుండు
 అన్న దాత ఇతడు, జ్ఞాన ప్రదాత, ఆరోగ్యదాతయై అలరు చున్నాడు
   ప్రత్యక్ష దైవమై జగతిని గాచునీ ప్రత్యక్ష కర్మసాక్షి! 
భక్తి, శ్రద్దల తోడ ఆరాధి0తము
  సుఖ,సంతోషములతోడ బ్రతుకుదము మనము

💐🙏🌷ఓం నమో అర్కాయ నమః...! 
        *****
కామెంట్‌లు