అంతర్యుద్ధం తరువాత
అంతరంగంలా
అలసట తీరిన తరువాతి
అన్వేషణలా
అనురాగంగా స్పందించిన
అందమైన లాలనలా
అరమరికలు తొలగిన
అభిమానంలా.....
ఆలోచనలు కలిసిన
ఆప్తమిత్రునిలా.....
ఆచరణలో ఉంచిన
ఆదర్శం లా...
ఆవేదన ఎరుగని
ఆరాధనలా
అనునయం దొరికిన
అలకలా .....
అక్షరాలకందని
అపురూప భావనలా...
అవ్యక్తానందదాయక
అనుభూతిలా...
అద్భుత కాంతులు చిందే
అద్వితీయం లా..
అందరికీ రోజూ
అంబరంలో కనిపించి
ఆత్మీయతే తప్ప
అసమానత తెలియని
ఆప్యాయతే తప్ప
ఆగ్రహం తెలియని
ఆదిత్యునికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి