చెమట సమాచారం! :- అచ్యుతుని రాజ్యశ్రీ

 అప్పుడే ఎండ చిటపటలు చెమట మొదలైనాయి ఫ్యాన్ కిందకి వెళ్ళగానే హాయిగా చల్లగా ఉంటుంది ప్రతి వ్యక్తి శరీరం నుంచి చెమట తో పాటు ప్రత్యేక దుర్వాసన బయటికి వస్తుంది ఇది సహజం ఆత్మవిశ్వాసం తక్కువ అయితే శరీరం నుంచి చెమట బాగా వస్తుందంటారు రోగాల వల్ల చెమట వాసన కొడుతుంది అని కొందరి వాదన చెమట తో పాటు అమోనియా లాంటి వాసన లివర్ జబ్బు వల్ల నెయిల్ పాలిష్ వాసన వస్తే డయాబెటిస్ చేప కంపు కొడుతుంటే మెటబాలిక్ డిజార్డర్ గా గుర్తించాలి అది సంకేతంగా భావించాలి చెమటతో వెలువడే ఫెర్మోన్ అనే పదార్థం ద్వారా మానవీయ భావాన్ని అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు ఇది ఎన్నో రకాలుగా ఉంటుంది ఎగ్రెషన్ ఫర్ మాన్, అలార్మ్, ఎపిడెమిక్, ఇన్ఫర్మేషన్ ఫెర్మాన్..ఇలా ఎన్నో ఉన్నాయి.
అసలు చమట అనేది అమోనియా ఉప్పు చక్కెర సోడియం పొటాషియం విటమిన్ సి యూరిక్ యాసిడ్ లాక్టిక్ యాసిడ్ క్లోరైడ్ తో తయారవుతుంది ఒక ఆరోగ్యవంతుడి చర్మం లో 2 లక్షల లక్షల 60 వేల చెమట గ్రంధులు ఉంటాయి చర్మంలోని రంధ్రాల్లోంచి  దుర్గంధం వస్తుంది. మానవ శరీరంలో రెండు రకాల చెమట గ్రంధులు ఉంటాయి అవి ఇక్రైన్
 గ్రంధి, ఈపో క్రైన్ గ్రంథి.ఇక్రైన్ గ్రంధి మస్తిష్కం చేతులు అరచేతులు నుంచి చమట బయటకొస్తే శరీరం చల్లగా అవుతుంది. 90% నీరుగా ఉంటుంది కాబట్టి దుర్గంధం ఉత్పత్తి చేసే తత్వం ఉండదు. ఈ పోక్రయిన గ్రంధి వల్లనే చమట కంపు కొడుతుంది ఒక ఆరోగ్యవంతుడి శరీరం నుంచి 475 మిల్లీలీటర్ల చెమట రోజు బయటికి వస్తుంది ఉష్ణోగ్రత ఆహారం దినచర్య భావనలు మనిషి ఆరోగ్యం పై చమట బయటికి వెళ్లడం ఆధారపడి ఉంటుంది బాగా వేడిగా ఉంటే మస్తిష్కం చెమటను విడుదల చేయమని శరీరానికి సందేశాన్ని పంపుతుంది ఈ ప్రక్రియను హైపోథాలమాస్ అంటారు గంధ హీనా దుర్గంధ యుక్త చమట బయటకు వచ్చేస్తుంది మన చెమట కంపు కొడుతుంటే పల్చగా పన్నీరు గంధం ఉడికిలో లోన్ స్ప్రే చేయాలి యాంటీసెప్టిక్ సబ్బు యాంటీఫంగస్ పౌడర్ వాడాలి ఎక్కడ చెమట ఎక్కువగా పడుతుందో అక్కడ పొడిగా ఉండటానికి నేడు మందులు కూడా వచ్చాయి కానీ చల్లని నీటితో శరీరాన్ని కడుగుతూ ఉంటే చాలు🌹
కామెంట్‌లు