ప్రభాకరుడే
ప్రత్యక్షదైవం
అంబుజుడే
అందరికారాధ్యం
నిత్యోదయమే
నగపతికర్తవ్యం
మేలుకొలపటమే
మర్కునిమొదటికార్యం
నీటినావిరిచేయటమే
నిశాకరునభిష్టం
వానలుకురిపించటమే
విభాకరునిలక్ష్యం
మొక్కలుపెంచటమే
మృగధరునిమనోవాంఛితం
పుడమినిపచ్చబరచటమే
పాలస్త్యునిపరమానందం
పూలుపూయించటమే
పక్షజునభిమతం
కాయలుకాయించటమే
కమలాప్తునుద్దేశ్యం
ప్రకృతినిచూపటమే
పౌలస్త్యునిపరమార్ధం
పరవశపరచటమే
పూర్ణమసుడిప్రయత్నం
అందాలుచూపటమే
ఆత్రేయునికిష్టకామం
ఆనందపరచటానికే
అంబుజునికారాటం
భూసంచారమే
భానుడికిప్రీతికరం
భూలోకవాసులక్షేమమే
భాసంతునికారాటం
సూర్యదేవునికి
స్వాగతంపలుకుదాం నిత్యం
విభాకరునికి
వందనాలుసమర్పిద్దాం ప్రతిదినం
రవిని
రంజింపచేయమందాం
కవిని
కవ్వింపచేయమందాం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి