నిన్నటి చీకటి తెర తీయకూ
వేకువ వెలుగుకు తెర వేయకూ
పగిలిన అద్దం వైపు పదే పదే చూడకు 2
ప్రపంచమెంతో పెద్దది - పరుగునాపకూ
1.శిశిరం వెనకే వసంత ఋతువు సొభగులిస్తుంది
గ్రీష్మతాప ఉపశమనం వర్షం కలిగిస్తుంది
వేదన వెనకే మోదం వేచి ఉంటుంది
సహనంతో ఉంటేనే కాలం కలిసొస్తుంది..నిన్నటి
నిన్నటి చీకటి తెర తీయకూ
వేకువ వెలుగుకు తెర వేయకూ
2. కళ్లకు తెలియదు ఒక కల నిజమౌతుందని
కన్నీళ్లకు తెలియదు చిరునవ్వు మొలుస్తుందని
కరిమబ్బుల ఆకాశం కురిసి తేట పడుతుంది
కష్టాలు తొలగిపోయి కలిమి చెలిమి చేస్తుంది ..నిన్న
నిన్నటి చీకటి తెర తీయకూ
వేకువ వెలుగుకు తెర వేయకూ
3. రేపటి సౌఖ్యం కోసం పక్షి గూడు కడుతుంది
రేపటి ఉపయోగానికి చీమ కూడవెడుతుంది
దారి మూసుకున్నపుడే ధైర్యం కావాలి
నిలకడ లేని వారికి నిలువ విలువ శూన్యం
నిన్నటి చీకటి తెర తీయకూ
వేకువ వెలుగుకు తెర వేయకూ
4.నిచ్చెననెక్కేటప్పుడు పై మెట్టే నీ లక్ష్యం
అవకాశం కోసం ప్రతి సారి ప్రయత్నించాలి..
రానున్న కాలాన్ని ఊహించి నడిస్తే
విజయం నీదే విలువైన భవిత నీదే
నిన్నటి చీకటి తెర తీయకూ
వేకువ వెలుగుకు తెర వేయకూ
పగిలిన అద్దం వైపు పదే పదే చూడకు 2
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి