సుప్రభాత కవిత : -బృంద
మనసనే ఆకాశంలో 
మినుకుమనే  చుక్కల్లా 
చివురించే  ఆశలెన్నో
తెల్లవారగానే మాయమౌనే!

చిన్ని దీపపు వెలుతురులో 
కన్నుమూసుకుని కన్న కలలన్ని 
నింగి దీపపు రాకతో 
బెదిరి చెదిరి పోయేనెందుకో!

రేయి వెలిగే తారా తోరణాలు
మాయమై పోవు కారణాలు 
వేయి వెలుగుల రేడు 
వస్తుండగా  మారు  వర్ణాలే!

కొత్త వెలుగుల వానలో 
కోటి ఆశల గొడుగేసుకుని 
వడివడిగా  అడుగులేస్తూ 
పడి లేస్తూ  పరుగులే!

నిలిచి నింగిని చూడగనే 
పిలిచి ప్రేమగా పలుకరించి 
నీకు తోడు నేనున్నానంటూ 
వెన్ను తట్టు లోకబాంధవునికి 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు