కవిగారి గారడీలు :- గుండ్లపల్లి రాజేంద్రపసాద్, భాగ్యనగరం
కిటుకులు
తడితే 
కవితలు ఒలికిస్తాడు కవి

తలపులు
ప్రవహిస్తే 
కైతలు పారిస్తాడు కవి

మెరుపులు
కనబడితే 
కవనాలు వెలువరిస్తాడు కవి

చెమక్కులు
అందితే 
చక్కనివ్రాతలు సృష్టిస్తాడు కవి

అందాలు 
అగుపించితే 
అక్షరకూర్పులు చేస్తాడు కవి

ఎత్తుగడలు
దొరకితే 
పసందుపంక్తిని ప్రారంభిస్తాడు కవి

విషయము
లభిస్తే 
వస్తువును కొనసాగిస్తాడు కవి

ముగింపు
చిక్కితే 
కయితలను పతాకస్థాయికిచేరుస్తాడు కవి

కలాలు
కదలితే 
కమ్మనికయితములు కుమ్మరిస్తాడు కవి

పుటలు
నిండితే 
కవిత్వమును పాఠకులకుచేర్చుతాడు కవి

కవనతీగ
చిక్కితే
దొంకనులాగుతాడు కవి

కవితాదారి
కనిపిస్తే
సాహితీలోకానికితీసుకెళతాడు కవి


కామెంట్‌లు