ఆణిముత్యం ...!! ---డా.కె.ఎల్.వి.ప్రసాద్.

 అమ్మ 
మార్గదర్శనముమెండు!
అందుకే,
చదువుసంధ్యలందు 
శ్రద్దగానుండు ....!
మాతృభాష అనిన 
మక్కువ ఎక్కువ ...!
లలితకళలు అనిన 
ఎగిరిగంతేయును ...!
సంగీతమనిన ...
చెప్పలేనంత ఇష్టం !
'అలెక్సా'ను -
అనుకరించుచూ 
రాగమాలపించును 
నాట్యముచేయును !
ఎన్ని వ్యాపకాలున్నా 
చదువును -
అశ్రద్ద చెయ్యదు ....
అన్నింటిలోనూ 
ఆణిముత్యం సుమా !
అభినందనీయురాలు,
మా మనవరాలు ఆన్షీ....!!
               ***

కామెంట్‌లు