చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం

 మత్తకోకిల

తల్లి మాటల మూటలందున తాండవంబున పోరుతో
పల్లవించె శివాజి కత్తిన భారతంబున కీర్తితో
తల్లడిల్లిన దీనులందరి దారి చూపిన దివ్వెగా
వెల్లగొట్టెను శత్రుశేషము వీర రౌద్రమ సింగమై



కామెంట్‌లు