కరుణించని కల ...!!----డా.కె.ఎల్.వి.ప్రసాద్.

 నాకునేను 
తగ్గించుకుని 
నన్నునేను 
నియంత్రించుకుని 
నీతోఆనందంగా 
సంభాషించడం 
నాకెంతొ -
సంతోషాన్ని  
పంచుతుంది !
ఎప్పుడైనా
ఆనందం-
అంచులు దాటి ,
సంబాషణ కాస్త 
శృతిమించితే 
నీకూనాకూ ....
ఏదోసందర్భంలో 
అసందర్భ అంశం 
మొలకెత్తి ,
మనిద్దరిమద్య 
అవగాహనాలోపం 
పడగవిప్పి ....
మనమనసులను 
కలుషితం చేస్తుంది !
అది ఒక కలాగా -
మిగిలిపొతుంది ....!!
         ***
కామెంట్‌లు