గణిత క్విజ్ విజేతలకు జ్ఞాపికలు

 సిక్కోలు గణిత ఉపాధ్యాయ సంఘం నిర్వహించిన మండల స్థాయి గణిత పోటీలలో తమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు పాతపొన్నుటూరు ఎంపియుపి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు తెలిపారు. మండల కేంద్రంలో జరిగిన గణిత శాస్త్ర క్విజ్ పోటీల్లో తమ పాఠశాల ఆరవ తరగతి, ఏడవ తరగతి విద్యార్థులు బలగ వెన్నెల, రేగేటి రోహిత్ కుమార్, సవిరగాన షర్మిళ, బుద్దల దీపక్ లు పాల్గొని కన్సోలేషన్ విజేతలుగా నిలిచారని ఆయన అన్నారు. ఈ గణితశాస్త్ర క్విజ్ కోసం ప్రశ్నావళిని సిక్కోలు గణిత ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులైన దండు ప్రకాశరావు, ఎల్.గోవర్ధనరావు, గేదెల వెంకట భాస్కరరావు, బూరాడ గణేష్, మీనాకుమారి, రామచంద్రరావు, పడాల సునీల్ తదితరులు రూపొందించి నిర్వహించారని వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన అన్నారు. ఈ నలుగురు విద్యార్థులు వెన్నెల, రోహిత్, షర్మిళ, దీపక్ లను అభినందిస్తూ జ్ఞాపికలను బహూకరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు, ఉపాధ్యాయులు అందవరపు రాజేష్, బూడిద సంతోష్ కుమార్, పైసక్కి చంద్రశేఖరం, యిసై సౌజన్యవతి, బొమ్మాళి నాగేశ్వరరావు, కుదమ తిరుమలరావులు బహుమతి ప్రదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.
కామెంట్‌లు