అనగనగా ఒక ఊరిలో ఇద్దరు మిత్రులు ఉండేవారు. కలుసుకొని మంచి చెడులు చెప్పుకుంటూ ఉండేవారు. దూరంగా ఉద్యోగాలు చేసుకుంటూ సెలవులలో కలుసుకొని సంతోషంగా ఉండేవారు. అలా ఒక రోజు కలుసుకొని వస్తుండగా ఒకరికి ప్రమాదం జరిగింది తనకోసం వచ్చి పోతుంటే అయింది అని ఆ ఖర్చు మొత్తం పెట్టుకున్నాడు. తర్వాత అలా నడుస్తుండగా వేసవి సెలవులలో తన కుటుంబంతో కలిసి ఉద్యోగం చేసే చోటుకి తీసుకొని వెళ్ళాడు ఆరోజు అతను చాలా సంతోషంగా అందరితో కలిసి అన్నం తిని ఒక వారం రోజులు ఉండి అని చెప్పి బయలుదేరాడు. పిల్లలతో సంతోషంగా గడిపాడు పోయినది శుక్రవారం రోజున మళ్లీ శుక్రవారం రోజున వస్తాను అని అమ్మకు గురువారం రోజు ఫోన్ చేశాడు. అలాగే అన్నది అమ్మ పిల్లలతో మీ ఫీజు ఈసారి ఒకేసారి కడతాను నాకు మంచి ఆఫర్ వచ్చింది. అని చెప్పాడు సంతోషంగా పిల్లలు పడుకున్నారు. సడన్ గా అర్ధరాత్రి గుండె నొప్పి వచ్చింది. తగ్గుతుంది గ్యాస్ నొప్పి అనుకోని పడుకున్నాడు. కానీ అది తగ్గినట్టు తగ్గి మళ్ళీ రాత్రి తెల్లవారుజామున 3:30am కు వచ్చింది భరించరాని నొప్పితో నావల్ల కాదు అని తన కారు తానే నడుపుకుంటూ తన భార్యను తీసుకొని వెళ్తాడు దురదృష్టశాత్తు ఆసుపత్రిలు నగరానికి దూరంగా ఉండడం ద్వారా చివరికి ఆసుపత్రికి ముందు కారు ఆపిన వల్ల కాదు అని తన భార్య చేతులు పట్టుకొని శ్వాస విడిచాడు.
దాని తర్వాత ఆ కుటుంబం శూన్యంలో వెళ్లిపోయింది. అదే సమయంలో తన స్నేహితుడు తన పిల్లలకు చెప్పిన మాటలు వృధా పోవద్దు అని తన స్నేహితుని చిన్న కూతురు యొక్క పీజు మొత్తం నేనే చెల్లిస్తాను అని బాధ్యత తీసుకున్నాడు ఇలా" 2"సంవత్సరాల నుండి ఆ అమ్మాయి బాధ్యత అతని చూస్తున్నాడు. అందుకే దేవుడు ఇలాంటి స్నేహితుడు ఉంటే ఒక్కరికి ఉండాలి అని కోరుకుంటున్నాను. ఈ కథలో మిత్రులు ఒకరు హిందూ. ఒకరు ముస్లిం. st

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి