ఈనెలజరిగే శాసనమండలి ఎన్నికల్లో పిడిఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరిని గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిలర్ దండు ప్రకాశరావు అన్నారు. కోరెడ్ల విజయగౌరికి మద్దతుగా కడుము, కురిగాం, మాతల, నివగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలతో పాటు నివగాం జూనియర్ కళాశాలల పర్యటనల్లో ఆయన ప్రసంగించారు. నిస్వార్థమైన సేవలతో, నిరంతర పోరాటాలతో, నిష్కల్మషమైన కృషితో న్యాయపరమైన డిమాండ్ ల సాధనకై శ్రమించే కుటుంబ నేపథ్యమున్న కోరెడ్ల విజయగౌరిని గెలిపించి, శాసనమండలికి పంపాలని ఆయన కోరారు.
జిల్లా కార్యదర్శి బోడ శ్రీను, జిల్లా కౌన్సిలర్లు కుదమ తిరుమలరావు, తూతిక సురేష్,బి.సంతోష్, యు.ఉమామహేశ్వరరావు, మండల శాఖ ప్రధాన కార్యదర్శి వి.మధుసూదనరావు, బి.వీరభద్రయ్య, కె.బాలకృష్ణ తదితరులు
ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో శ్రమిస్తున్న ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ బలపర్చిన పీడిఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరిని గెలిపించాలని కోరుతూ ప్రసంగించారు. ఇప్పటివరకూ శాసనమండలికి డి.రామిరెడ్డి, చుక్కా రామయ్య, వి.బాలసుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, ఎంవిఎస్ శర్మ, డా.ఎం.గేయానంద్, కె.జార్జివిక్టర్, వై.శ్రీనివాసులురెడ్డి, బి.నాగేశ్వరరావు, రాము సూర్యారావు, షేక్ సాబ్జీ, కె.ఎస్.లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు, బొర్రా గోపిమూర్తిలనే పద్నాలుగు మందిని పీడీఎఫ్ తరఫున శాసనమండలికి ఎంపిక చేయడం జరిగిందని వారి వారి ప్రసంగాలలో గుర్తుచేశారు. నిజాయితీ నిబద్దతలతో కూడిన సేవలనందించి సత్ఫలితాలను అందజేయుటకై తపిస్తున్న కోరెడ్ల విజయగౌరిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని యుటిఎఫ్ నేతలంతా కోరారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి