ఈయన ఎవరో కాదు:- - యామిజాల జగదీశ్
 ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి బిచ్చగాడో లేక నిరాశ్రయుడో కాదు. ఆయన రష్యాకు చెందిన ప్రముఖ రచయిత లియో టాల్‌స్టాయ్. ఆయన తత్వవేత్త. ఆయన రాసిన "వార్ అండ్ పీస్", "అన్నా కరెనా" ప్రపంచ ప్రసిద్ధి చెందాయి.  
ఆయనను ఎప్పటికప్పుడు గొప్ప రచయితలలో ఒకరుగా పరిగణిస్తుండేవారు. సాహిత్యంలో వాస్తవిక ఉద్యమంలో కీలక వ్యక్తిగా తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న లియో టాల్ స్టాయ్
నిరాశ్రయుల కోసం తన వద్ద ఉన్నదంతా అమ్మేశారు. ఆహారం కోసం అడుక్కునేవారు.
టాల్‌స్టాయ్ 1828 సెప్టెంబరు 9న రష్యాలో జన్మించారు. 1910 నవంబర్ 20న మరణించారు. 
ఆయన నైతికతనూ, మానవ స్థితినీ ఇతివృత్తాలుగా చేసుకుని రచనలు చేసారు. ఆయన రచనలను నేటికీ విస్తృతంగా  చదివేవారున్నారు. అధ్యయనం చేసే వారూ ఉన్నారు.
 
ఆయన చెప్పిన కొన్ని  ఆణిముత్యాలు....
"మీ మతం గురించి నాకు చెప్పకండి. మీ చర్యలలో మీ మతాన్ని చూడనివ్వండి"
"నీకు నొప్పి అనిపిస్తే సజీవంగా ఉన్నట్లు అర్థం.... కానీ, ఇతరుల బాధను అనుభవిస్తే మనిషి అని అనిపించుకుంటారు."
టాల్‌స్టాయ్ వారసత్వం సాహిత్యానికి మించి విస్తరించింది.  
ఆయన ఒక తత్వవేత్త. సంఘ సంస్కర్త. అహింసాత్మక ప్రతిఘటన, సాధారణ జీవనం గురించి ఆయన ఆలోచనలు మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వంటి నాయకులను ప్రేరేపించాయి.

కామెంట్‌లు