ఈ ఏడాది నైరుతీ రుతు పవనాలు కాస్త ముందుగానే వస్తాయన్న ఐ ఎం డి ఏ అంచనాలు రైతాంగంలో ఆశలు రేకెత్తించాయి. దానికి తోడు వర్షాలు కిందటి సంవత్సరం కంటే మెరుగ్గా వుంతాయని., రైతులందరూ ఖరీఫ్ సీజన్ కు వెంతనే సన్నద్ధం కావాలన్న కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటన ఎంతో ఆశాజనకం గా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం మార్కెట్ లో అధిక విత్తనాల ధరలు, పెట్రోల్, డీజల్ ధరలు రోజు రోజుకూ పెరుగుతూ వుండడం, దళారుల దోపిడీ విధానం, ఠారెత్తిస్తున్న పురుగుల మందుల ధరలు, రైతులకు కనీస లాభాలను కూడా తెచ్చిపెట్టని కనీస గిట్టుబాటు ధరలు రైతులకు వ్యవసాయం ఒక గుదిబండగా మార్చింది. కార్పొరేట్ సీడ్ కంపెనీలు ఇష్టారాజ్యం గా రేట్లు పెంచేసి దోపిడీకి పాల్పడుతున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకుంటున్నాయి. ఆహార భద్రతా మిషన్, పప్పు దినుసుల అభివృద్ధి, చిరు ధాన్యాలకు ప్రోత్సాహం, సీడ్ విలేజ్ ప్రోగ్రాం వంటి పధకాలు ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా కునారిల్లుతున్నాయి. అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల నుండి రైతులను రక్షింంచేందుకు నిర్దేశించిన రైతు భీమా పధకం అమలులో చతికిల పడింది. సమగ్ర విత్తన చట్టం పై భారీగా హామీలు కుమ్మరించిన కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్ళుగా ఈ అంశం పై నానుస్తొంది. తెలుగు రాష్ట్రాలలో రైతుల ఆత్మ హత్యలు పెరగడంపై కేంద్ర మానవ హక్కుల సంఘం కిందటి సంవత్సరమే ప్రభుత్వాలకు నోటీసూ ఇచ్చినా దిద్దుబాటు చర్యలు శూన్యం. మ్రొక వైపు వ్యవసాయ రంగం పెను భారంగా మారడంతో దేశవ్యాప్తం గా రైతు సొదరులు వ్యవసాయ వృత్తిని వదీపెట్టి ఇతర ఉపాధులు వెదుక్కుంటూ పట్టణాలకు వలస వెళ్ళే సంఘటనలు ఎక్కువౌతున్నాయి. నకిలీ విత్తనాల ఉచ్చులో రైతన్నలు చిక్కుకొని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రతీ మండలంలో ఒక భూసార పరీక్షల కేంద్రాన్ని నెలకొల్పడం, విత్తనాల తయారీ సంస్థలపై తనిఖీలు, నిఘా వంటి చర్యలను ప్రభుత్వాలు తక్షణం చేపట్టాలి. పారిశ్రామీకరణ కోసం వ్యవసాయ భూములను ఇవ్వడం పై నిషేధాన్ని విధిస్తూ పార్లమెంటులో తక్షణం చట్టం తీసుకురావాలి.రైతులకు వ్యవసాయ రంగం లాభసాటిగా వుండేలా ప్రాత్సాహక పధకాలను ప్రవేశపెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చర్యలు చేపట్టాలి
వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి: - సి.హెచ్.ప్రతాప్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి