మంచిమాటలు:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, -భాగ్యనగరం
వేలుపెట్టకు
పరుల వ్యవహారాల్లో
ధూషణలకు గురికావచ్చు
దెబ్బలను తినవచ్చు

జోక్యంచేసుకోకు
అనవసరపు విషయాల్లో
దొరికి పోవచ్చు
దోషివి కావచ్చు 

అడ్డదారులు
తొక్కవద్దు
అపనిందలబారిన పడవద్దు
అప్రతిష్టపాలు కావద్దు

ప్రేలకు
వ్యర్ధ ప్రలాపనలు
నోటిదూలను తీర్చాలనుకోకు
వదరుబోతువు కాకు

కూల్చకు
పచ్చని సంసారాలు
పాపాలు మూటకట్టుకోకు
దుష్టుడవని అనిపించుకోకు

ఈదకు 
ఏటిప్రవాహానికి ఎదురు
ప్రమాదాలు కొనితెచ్చుకోకు
ప్రాణానికి ముప్పుతెచ్చుకోకు

చేయకు
చెడ్డ పనులు
చిల్లర చేష్టలు
చీకటి కార్యాలు


వినుము 
మంచి మాటలు
పెద్దల హితాలు
పండితుల సూక్తులు

కామెంట్‌లు