ఇదం తే యుక్తం వా పరమశివా కారుణ్యజలధే
గతౌ తిర్యగ్రూపం తవపద శిరోదర్శనధియా!
హారిబ్రహ్రాణౌ తౌ దివి భువి చరం తౌ శ్రమయుతౌ
కథం శంభో స్వామిస్కధయ మమ వేద్యోసి పురతః !!
భావం: ఓ పరమశివా ! కరుణా సముద్రుడా! నీకు తగునా ! నీ పాదములను మరియు శిరస్సును చూచుటకై హరిబ్రహ్మలు జంతు రూపమును జంతు రూపమును ధరించి ఆకాశములోనూ, భూమిలోనూ సంచరించి శ్రమ చెందిరి. ఓ శంకరా!స్వామీ! నా కెదురుగా ఎట్లు ప్రత్యక్ష మగుదు వో చెప్పుము .
*****
శివానందలహరి:- కొప్పరపు తాయారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి