స్రవంతి 10వ తరగతి చదువుతున్నది. మొదటి నుంచీ అన్నం సరిగా తినక పోయేది. ఆ కూర బాగా లేదని, ఈ కూర బాగా లేదని అన్నం పారేసేది. తోటి స్నేహితురాలు శ్రీవాణి పదే పదే హెచ్చరించింది. కడుపు నిండా తినక పోతే ఆరోగ్యం దెబ్బ తింటుంది అని, అన్ని కూరలూ అలవాటు చేసుకోవాలని. శ్రావణి అనే అమ్మాయి టీచర్లకు చెప్పింది కూడా స్రవంతి తిండి విషయం. టీచర్లు స్రవంతిని పిలిచి చిలక్కి చెప్పినట్లు చెప్పారు ఆరోగ్యానికి అన్ని కూరగాయలు తినడం తప్పనిసరి అనీ, ఏ ఒక్క కూరగాయ ఇష్టం లేదు అని తినకున్నా ఆరోగ్యం దెబ్బ తింటుంది అని, స్రవంతి చాలా బక్కగా ఉన్నందున ఆరోగ్యం కాపాడుకోవడం ముఖ్యమని, తిండి విషయంలో అశ్రద్ధ పనికిరాదు అని చెప్పారు. అయినా షరా మామూలే.
10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మొదలు అయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్ష రాస్తూ రాస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది. ఆసుపత్రికి తీసుకు వెళ్ళారు. తెల్లారి హిందీ పరీక్ష రాయలేక పోయింది. ఆ తర్వాత క్కోలుకున్నాక మిగతా పరీక్షలు రాసి గట్టెక్కింది. తెలుగు ఫెయిల్. హిందీ ఆబ్సెంట్. పరీక్షా ఫలితాలు వచ్చాక మిగతా విద్యార్థులు రిజల్ట్ చూసుకుని సంబర పడుతుండగా స్రవంతి ఇంట్లోంచి బయటకు రాలేదు. వెక్కి వెక్కి ఏడుస్తుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి