సుప్రభాత కవిత : -బృంద
స్వప్నమ్ ఎంత బాగున్నా 
మేలుకునే తీరాలిగా!
నిజం  చేసుకోవాలంటే 

సత్యం ఎంత చేదైనా 
ఒప్పుకునే తీరాలిగా!
గెలుపు సాధించాలంటే 

కలతలెంత కవ్వించినా 
భరించే తీరాలిగా!
సమయం రావాలంటే 

తలపులెంత వేధించినా 
తట్టుకునే తీరాలిగా!
పోరాటం కొనసాగించాలంటే 

కనులెంత ఆపుకున్నా 
కురిసే తీరాలిగా!
బరువు తీరాలంటే 

మనసెంత  నొచ్చుకున్నా 
సర్దుకునే తీరాలిగా!
కలిసి నడవాలంటే 

చీకటెంత  కమ్ముకున్నా 
నిరీక్షించే తీరాలిగా!
వెలుగు రావాలంటే

తానే అంతా అయినా 
ఎవరికీ ఏమీ కాక 
తనదే అంతా అయినా 
ఏమీ సొంతం కాక 

అందరికీ సమానంగా 
అన్ని అవసరాలు తీర్చే 
ఆదిదైవమైన  ఆదిత్యునికి 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు