అంతటా నిండి ఉన్న
అంతు తెలియని అంతర్యామిని
ఆనందరూపుడై అంతరంగాన్ని
ఆవరించి అనుగ్రహించమని అర్థిస్తూ....
ఆయుధాలు ధరించిన
ఆ రూపు అపురూపమే కానీ
అవి నా ఆరు శత్రువులను
అంతమొందింపచేయాలని .
ఆ కరుణ నిండిన కనుచూపు
మేరలోనే సదా నేనుండిపోయేలా
అనుగ్రహించమని...
ఆ చేతిలోని త్రిశూలము
నా నిద్ర మెలకువ సుషుప్తులను
అనుక్షణం అదుపు చేయాలనీ...
ఆ ఢమరుకపు సవ్వడి
నా ఎదసడిగ మారి నిరంతరము
నీ నామము స్మరింపచేయాలని...
నీకు నగలైన నాగులు
నాకు ధర్మము పై భయము
భక్తిని గుర్తు చేయాలని...
నీ తలనున్న నెలవంక
నిరతము నా మదినిండా
భక్తి వెన్నెలలు ప్రసరింపచేయాలని..
ధర్మమార్గమున నను నడిపి
కర్మబంధములు క్రమముగా
తొలగింపచేయాలని...
పర్వదినమున పరమేశ్వరుని
అనుగ్రహము ప్రసాదించమని
పరిపరి విధముల ప్రార్థిస్తూ...
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి