న్యాయములు-780
"అల్పారంభః క్షేమకరః న్యాయము
*****
అల్ప అనగా తుచ్ఛమైనది, ముఖ్యము కానిది, కొంచెము, సూక్ష్మము.ఆరంభ అనగా ప్రారంభం. ,క్షేమకరః అనగా మేలు కలిగించేది అని అర్థము.
ఒక్కసారి పెద్ద పరుగులు పరుగెత్తడం మంచిది కాదు. కొంచెముగా ఆరంభించి పెద్ద ప్రయత్నములకు దిగవలెను అని అర్థము.
చిన్న ప్రయత్నము లేదా చిన్న చిన్న పనులే పెద్ద పెద్ద ఫలితాలకు మూలాలు అవుతాయనీ,ఈ ప్రయత్నాలే పెద్ద మరియు సానుకూల మార్పులకు నాంది పలుకుతాయనీ,ఆత్మ విశ్వాసం కోల్పోకుండా ఉండాలంటే చిన్న చిన్న పనులు మొదలు పెట్టి వాటిని ఎంతో ఇష్టంగా కష్టపడి పూర్తి చేయాలి.అలా సాధించిన విజయం వలన ఆనందం కలుగుతుంది.ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.ఈ చిన్న చిన్న విజయాలకు పునాదిగా నిలిచిన పనులే పెద్ద పెద్ద లక్ష్యాల వైపుకు అడుగులు వేయిస్తాయని మన పెద్లలు చెబుతుంటారు.
ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు.అన్నీ సమకూర్చబడి ఉండవు. ఒక వేళ సమకూర్చబడి ఉన్నా ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఎవరూ గెలుపు రుచిని చూడలేరు. ఉదాహరణకు వంద మీటర్ల దూరమైనా పరుగెత్తడం అభ్యాసం చేయకుండా ఒకేసారి వందల కొద్దీ మీటర్లు పరుగెత్తుతాను అని పరుగెత్తితే గెలుపు మాట దేవుడెరుగు ముందు ఆరోగ్యం పాడవడం, ప్రాణాపాయం సంభవించడం ఖాయం. కాబట్టి చిన్న చిన్న ప్రయత్నాలు, చిన్న చిన్న విజయాల నుండి ప్రారంభించి పెద్ద పెద్ద లక్ష్యాల సాధన కోసం ప్రయత్నాలు కొనసాగించాలి. అప్పుడే విజయాల కోసం వేసిన మార్గం సుగమం అవుతుంది.ఎన్ని వేల మైళ్ళ ప్రయాణమైనా వేసే మొదటి అడుగుతోనే ప్రారంభం అవుతుందనేది ప్రతి క్షణం గుర్తు పెట్టుకోవాలి.
ఇక మనలోని మంచిని వెలికి తీసే ప్రవర్తనను ఒకేసారి రాశిగా పోసి అయోమయ స్థితిలో ఉండటం కంటే , ఒక చిన్న ప్రయత్నం లేదా ప్రవర్తనతో ప్రారంభించాలి.దానిని దినచర్య భాగం చేస్తే నెమ్మదిగా పెద్ద పెద్ద లక్ష్యాల విషయంలో దృఢత్వం, స్థిరత్వం పెరుగుతుంది.
చిన్న దానితోనే మొదలు పెట్టమని మన పెద్దవాళ్ళు ఎందుకు అంటారంటే... చిన్నపని సులభంగా చేయగలగడం వలన మనలో ఆత్మ విశ్వాసం అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది.అందులోని సానుకూల ఫలితాలు, విజయాలు మనసుకు ఉత్తేజం, ఉల్లాసంతో పాటు ప్రేరణ కలిగిస్తాయి.తర్వాత వేసే అడుగు ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు పడుతుంది.
ఇదండీ!"అల్పారంభః క్షేమకరః న్యాయము" వెనుక ఉన్న అసలు అంతరార్థము.దీనిని గ్రహించగలగితే ఎదురు సవాళ్ళను అలవోకగా అధిగమించవచ్చు.
కొంతమంది ప్రారంభం అత్యంత ఘనంగా మొదలు పెట్టి పూర్తి చేయలేక మధ్యలోనే వదిలి పెడతారు.అలా వదిలివేయడాన్ని 'ఆరంభ శూరత్వం' అని కూడా అంటారు.కొంతమంది ఎంతో ఆడంబరంగా మొదలు పెట్టిన పని కాస్తా మధ్యలోనే ఆగిపోతుంది.అలాంటి వారిని ఉద్దేశించి అలా వుండకూడదనే హితవుగా చెప్పడం కోసం కూడా ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
"అల్పారంభః క్షేమకరః న్యాయము"ను నిశితంగా అర్థం చేసుకుంటే ఫలితాలు తప్పకుండా ఊహించిన వాటికంటే ఎక్కువ వస్తాయి .విజయాలను సొంతం సొంతం చేసుకోవచ్చు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి