తెలుసుకుందాం! అచ్యుతుని రాజ్యశ్రీ

 సామాన్యజనాలు తమ పరిసరాల్ని గమనించి కొత్త ఊహలు ఆలోచనలతో నూతన సిద్ధాంతాల్ని కనుగొన్నారు.ఆవిష్కరించి శాస్త్ర విజ్ఞాన వేత్తలు గా చరిత్ర లో నిలిచారు.ఆస్ట్రలే అనే యువకుడు దారిలో నడుస్తూ కారు యాక్సిడెంట్ కి గురై విలవిల లాడటం చూశాడు.వెంటనే ప్రాథమిక చికిత్స చేసి కట్టుకట్టి గొప్ప సర్జన్ గా కొందరికి ఉచిత వైద్యం చేస్తూ దానధర్మాలతో మంచిపేరు పొందాడు.నీరు నిండిన పాత్ర లో బరువు పడగానే నీరుబైటికి పొర్లుతుండటం చూసిన ఆర్కిమిడీస్ సిద్ధాంతకర్త గా నిలిచాడు.పైజా నగరంలో చర్చీపై వేలాడే లాంతర్ని చూసి గెలీలియో పెండ్యులం సిద్ధాంతాన్ని కనిపెట్టాడు.వేలాడేవస్తువు గాలికి కాసేపు అటూఇటూ ఊగి ఆగిపోవటం చూసిన దృశ్యంఅది!
చెట్టుమీద నుంచి పండు కింద పడటంచూసి గురుత్వాకర్షణ శక్తి భూమికి గలదని నిరూపించినవాడు న్యూటన్.ఒకవ్యక్తి ఆర్ట్ గ్యాలరీలో వింత చిత్రాన్ని చూశాడు.మొహమంతా వెంట్రుకలతో కప్పిన  కాలి పాదాలకి రెక్కలను గీసిన మనిషిచిత్రం అది.తన భావాన్ని ఇలా వివరించాడు" నాచిత్రం ప్రత్యేకత ఏమంటే కాలం అంటే టైం పరుగులు తీస్తుంది. అందుకే పాదాలకి రెక్కలు! మంచి సమయం అవసరం అనేదాని జుట్టుపట్టుకుని మనచేతిలో బంధించాలి. ఛాన్స్ అనేది మొహంపై కప్పుకొన్న కురులు.దాన్ని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. జుట్టు లేని తల బోడిగుండు శూన్యం.ఛాన్స్ టైం సద్వినియోగం చేసుకోని మనిషి బ్రతుకు శూన్యం".పరీక్షల జుట్టు దొరకబుచ్చుకుని ఛాన్స్ ని సద్వినియోగ పర్చుకుని టైం కి జవాబులు రాస్తే పాస్! దిక్కులు చూస్తే జీవితంలో ఓటమి.ఎక్కడ వేసిన గొంగళి అక్కడే! ఫర్గూ అనే గొర్రెల కాపరి విరిగిన పగిలిన గాజుముక్కల్తో ఆకాశంలోని చుక్కల్ని దూరాన్ని తెలుసుకునే ప్రయత్నాలు చేశాడు.జార్జ్ స్టీఫెన్ కొయ్యపలకలపై బొగ్గుతో గణిత సిద్ధాంతాలు ప్రాక్టీస్ చేసి గొప్ప గణిత శాస్త్ర వేత్త అయ్యాడు.ఛాన్స్ టైం మిషన్ లో చిన్న నట్లు.సాగిపోయే  అలలు. వాయిదా వేస్తే కాలం గుప్పిట్లోంచి జారి మరి చేతికి చిక్కదంతే. వయసులో తగిన పనులు చేస్తూ సమయసద్వినియోగం చేసే మనిషి జీవితం ధన్యం.కర్తవ్యంతో దైవస్మరణ ముక్తికి సోపానం🌷
కామెంట్‌లు