విశ్వహిందు పరిషత్ వారు రామాయణం మహాకవ్యం పైన నిర్వహించిన పరీక్ష పోటీలో కె.వి.ఆర్ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపర్చారు.
జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన సి.లక్ష్మీయోగేష్, కె.గంగోత్రి, సి.శిరీష విద్యార్థులను మరియు ఉపాధ్యాయులు బోయ శేఖర్,మరియు విజయ గారిని కర్నూలు విశ్వహిందు పరిషత్ కమిటీ సభ్యులు అభినందన సభలో జ్ఞాపికాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా కె.వి.ఆర్ పాఠశాల ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి గారు,విజయలక్ష్మి గారు రామాయణం మహాకవ్యం పరీక్ష పోటీలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థులను అభినందించారు.అనంతరం సాధు శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ రామాయణం ఒక మనిషి జీవన శైలిని తెలిపే మహాకవ్యం,జీవితంలో మనిషి బంధాలు, అనుబంధాలను తెలిపే మహాకావ్యమని అందరుకూడా చదవాల్సిన మహాకవ్యం అన్ని, అందరు పోటీతత్వంతో ప్రతి పోటీలో పాల్గొన్నాలని తెలిపారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి