సుప్రభాత కవిత : -బృంద
కల చెదిరిన అలజడిలో 
ఎదలో ఎన్ని సుడులో 
వల వేస్తే దొరికేనా 
కల వరమయ్యే కారణాలు?

కనిపించని వేదనలేవో 
కప్పెట్టిన అడుగుపొరలో 
మరిపించే మనసుకు 
తెలిసేనా మురిపించే మంత్రమేదో!

వరమై దొరికే అవకాశం 
వద్దకు వచ్చి నిలబడితే
శోధించు ప్రశ్నలన్నిటికీ 
దొరికేనా చక్కని సమాధానం?

చెరిపేసిన కోరికలు 
వదిలేసిన ఆశలు 
కదిలించిన కష్టాలకు 
వచ్చేనా చిగురించే తరుణం?

గడచిన క్షణాలన్ని 
మార్చలేని గతాలైతే 
జ్ఞాపకాలు కడవరకు
నడిపించేనా ప్రేమగా నేస్తాలై!

కుదురు లేని మనసుకు 
ఎదురులేని విజయమిచ్చి 
చెదరని విశ్వాసం  కలిగిస్తూ 
వదలక బ్రోచే వెలుగుల గనికి 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు