మాతృభాష-గిడుగుసేవలు:- కోరాడ నరసింహా రావు !

 * అమ్మ నేర్పిన భాష *
       ******
 మనకు ఉగ్గు పాలతోనె  అమ్మ నేర్పిన భాష..., 
   తీయనైనది మన తెలుగు భాష...! 

నన్నయ, తిక్కన, కృష్ణ రాయలాదిగా... 
 కావ్యములు రచించిన అమరాంద్రమ్ము
   గ్రాంధిక తెలుగు భాష..! 

నాగరికులు మాట్లాడెడి 
 మన తెలుగు శిష్ఠవ్యావహారిక భాష...! 

పండితులు కొందరికె అర్ధమయ్యెడి  గ్రాంధిక భాషను  పామరులకు సైతము , అందరికీ అర్ధ మగునటులగ్రంధ రచనను
 సామాన్య వ్యావహారికమునకు ఎన లేని కృషిని సల్పి, తెలుగు వ్యావహారిక భాషకు గొడుగు పట్టి ఉద్యమము నడిపిన ఘనుడు మన గిడుగు!

మన తెలుగుపద్యమునకు
 వేమన, బద్దెనలు ఎనలేని ఖ్యాతి తేగా..., 
  కందుకూరి, గురజాడ, శ్రీ శ్రీ లు
 మన తెలుగు వ్యావ హారికమును 
మును ముందుకు తీసుకు పోయినమహానుభావులు! 

అనేక ప్రాంతీయ మాండ లికములతో
 శాఖోప శా ఖలుగ విస్తరించెను గదా మన తెలుగు భాష...! 

పండిత కవి పోషకుడని ఖ్యాతిగాంచిన
 శ్రీ కృష్ణదేవ రాయలచే "దేశభాషలందు తెలుగు లెస్స"
 అనిపించుకున్న గొప్ప భాష మన తెలుగుభాష! 

ఎన్నెన్నో మధుర పదార్ధములకంటే... 
  మధురమైన మన తెలుగు తియ్యదనమును 
 అను భూతించి ఆనందిం చక...
మన తెలుగు, మన మాతృ భాష గొప్ప తనమును 
తెలుసుకోలేక పర భాష వెంట పరుగులు
 సిగ్గు చేటు...!! 
      ముందు మన తెలుగు 
 వే రే భాష యైననూ తదు పరియే...! 
 జై తెలుగు భాష... 
జై జై మాతృ భాష... 
     **"**
కామెంట్‌లు