ప్రేమంటే ఏమిటో
నీ ప్రేమ రుచిచూశాక
నీలోప్రేమచూసాక
అర్థమైంది నాకు ....!!
----------------------------
రెండుఅక్షరాల ప్రేమలో
ఇంతప్రేమ దాగివుందని
నీప్రేమను ఆస్వాదించాక
తెలిసిందినాకు ......!!
---------------------------------
ప్రేమించడంలోని తేలిక ,
ప్రేమింపబడడంలోని కష్టం
ప్రేమించడంతెలియకపోతే
ఎదురయ్యేనష్టం ..అన్నీ వింతలే !!
---------------------------------------------
ప్రేమనుప్రేమిస్తే ....
ప్రేమలోని సారం
ప్రేమై ప్రేమగా ....
ప్రణయానికి దారితీస్తుంది !!
---------------------------------------------
మన ప్రేమకు ప్రత్యేకంగా
ఒకరోజంటూ లేనేలేదు ...!
మనప్రేమ నిత్యం పదిలం
మనప్రేమ శాశ్వతం ....!!
---------------------------------------------
అనంతమైన మన ప్రేమకు
ముఖ్య ఆదారం నువ్వు !
విశ్వ ప్రేమకు ......
నిలువెత్తు సంతకం నువ్వు !!
-----------------------------------------------
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి