శరణు శరణు సర్వేశ్వర:- కోరాడనరసింహా రావు.
ఆద్యంత రహితా...      అనంత లింగ స్వరూపా ! 
 అచ్యుతుని హృదయ నివాసి... 
   ఆకాశ గంగను తల పైన విషమును కంఠములోన
  ధరించి, భరించి లోకములను గాచిన పరమేశ్వర...! 
    సాకార - నిరాకార
   హిమగిరి నీకు మందిరమా... 
  స్మశానము నీ నివాసమా
   రుద్రాక్ష లైన,విష నాగులైన... 
    నెలవంక యైన, చితి భస్మ మైన ... 
   నీకు భూషణములే గదా
  ఫాల భాగమున జ్ఞాననేత్ర  మును ధరించి నావు... 
   త్రిసూలమ్మును చేత బూనిన త్రిగుణాతీతుడవీ వు...! 
  నీ డమరుక ధ్వని లో.. 
 తెగి పడిన నీ కాలి మువ్వ సవ్వడిలో...
 సాహిత్య,సంగీత,నాట్య ములకు ఆది గురువు వైనావు...! 
   నిరంతర తపోధనుడవై పునః సృష్ఠి కొరకు 
లయ కరుడ వగుచున్నావు..! 
   యే క్షణమైననూ సతిని వీడి లేననుచు
 అర్ధనారీశ్వ రుడవై ఇల దా0పత్యము నకే 
ఆదర్శముగ నిలిచావు 
 పిలిచి నంతనేపలికే దయా సాగరుడవనీ పేరు గాంచినావయ్యా...! 
   ఓ పరమ శివ... 
     అపన్నుల పాలిటి అనంత కృపామూర్తి... 
  శివ శివ హర హర శంభో శ0కరా...! 
   పాహిమామ్  రక్ష మామ్
 శరణు శరణు సర్వేశ్వరా! 
💐🙏🌷🙏💐🙏🌷🙏

కామెంట్‌లు