విశాఖలో విరబూసిన విలువల విరిమాల, సాగర తీరాన సాహసించిన ఆత్మవిశ్వాసం, ఉత్తరాంధ్రలో ఉద్భవించిన ఉన్నతమగు దేదీప్యం, ఆంధ్రజాతికే వన్నె తెచ్చిన ఆణిముత్యం, భారతావని భాసిల్లే భావనిధి, మహిలో మహిళామణులకే స్ఫూర్తిదాయకమైన డా.కుప్పిలి కీర్తి పట్నాయక్ కు ఘనమైన గుర్తింపు లభించింది.
శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా
అంతులేని సేవల తపస్విగా కీర్తిగాంచుతున్న కీర్తి పట్నాయక్ ఇప్పటికే అనేక పురస్కారాలు, సత్కారాలు స్వీకరించియున్నారు.
ఈమేరకు కీర్తి పట్నాయక్ సేవలను కీర్తిస్తూ జాతీయ మహిళా శిశు సంక్షేమ శాఖ వారు ఆమెకు పురస్కారం ప్రకటిస్తూ ధృవీకరణపత్రం బహూకరించారు.
కేంద్ర ప్రభుత్వ శాఖకు చెందిన ఆ సంస్థ ఎలక్ట్రికల్ ఇంజనీర్ వి.శ్రీనివాసరావు చేతులమీదుగా ఈ అవార్డు ప్రశంసాపత్రాన్ని కీర్తి పట్నాయక్ అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ
పేదలంటే ఎనలేని కృప, దయ, ప్రేమ గల మనస్తత్వం కలిగిన వ్యక్తి కీర్తి అని, బడుగు వర్గాలకు మేలు చేయాలన్న, ఆపదల్లో ఆదుకోవాలన్న తపన గల మనీషిగా కీర్తిగాంచారని అన్నారు. ప్రతిభకు పట్టం కట్టాలనే ప్రోత్సాహక సౌశీల్యం, వృద్ధులపట్ల దివ్యాంగులపట్ల అమితమైన అనురాగంతో ఎన్నో సేవలు ఆమె చేస్తున్నారని ఆయన అన్నారు.
అలాగే సిపిడీఓ సంస్థ తరఫున కూడా ఆ సంస్థ ప్రతినిధి రమణికుమారి పురస్కారాన్ని ప్రకటించారు. ధృవీకరణ పత్రాన్ని కీర్తి పట్నాయక్ కు బహూకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ
నీతివంతమైన జీవిత నైపుణ్యం మెండుగా ఉన్న కీర్తికి
ప్రకృతి పట్ల, చిన్నారుల పట్ల అత్యంత అభిమానమని,
ఆద్యాత్మిక ఆచార వ్యవహారాలకు కట్టుబడ్డ వ్యక్తిత్వంతో నాటి సాంప్రదాయ నియమావళిని పాటిస్తూ ముందడుగు వేస్తూ అదర్శప్రాయులుగా నిలుచుట మిక్కిలి అభినందనీయమని అన్నారు.
శ్రీకాకుళం జిల్లా, పొందూరులో జన్మించి, విశాఖపట్నం మురళీనగర్ లో స్థిరపడిన కీర్తి, వారి తండ్రి డా.కుప్పిలి త్రినాథరావు పట్నాయక్ గారి స్ఫూర్తితో నిరంతరం సేవాకార్యక్రమాలు చేయుచుండుట ఒక విశేషంగా చెప్పవచ్చు.
2003లో కీర్తి స్థాపించిన శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో చిత్తశుద్ధితో కూడిన సేవాకార్యక్రమాలు నిర్వహించుచున్నారు.
రెండు దశాబ్దాలకు పైగా నిర్విరామంగా సొంత ఖర్చులతో స్వచ్ఛమైన మనస్సుతో కృషి చేస్తున్నారు కీర్తి పట్నాయక్. స్వచ్ఛభారత్, పచ్చదనం పరిశుభ్రత, పల్స్ పోలియో కంటి వెలుగు మున్నగు ఆరోగ్య శాఖ శిబిరాలు, దేశ సంస్కృతిని ప్రతిబింబించే అభ్యుదయ పథకాలన్నింటిలోనూ తనదైనశైలిలో కీర్తి స్వచ్ఛందంగా చొరవ వహించి అమలుపర్చుట మిక్కిలి అభినందనీయం.
సేవాభావంతో మాత్రమే శ్రమిస్తున్నారు తప్ప ఎలాంటి రాజకీయ పదవులను గాని, ఎట్టి నామినేటెడ్ సభ్యత్వాలు గానీ ఆశించకుండా నిస్వార్ధంతోనే దూసుకుపోతున్న సేవతత్పరత కీర్తి పట్నాయక్ సొంతం.
కరోనా మహమ్మారి విజృంభించే సమయంలో వ్యాధిగ్రస్తులకు, లాక్ డౌన్ కు గురైన వలసజీవులకు ఎంతగానో సహకారాలను అందించారు కీర్తి. ఇంటినుండి బయటకు రావడానికి భయభ్రాంతులు చెందే సమయంలో సైతం తన ప్రాణాలకు లెక్క చేయకుండా మాస్కులు, శానిటైజర్స్, ఫినాయిల్ బాటిల్స్, బ్లీచింగ్ పౌడర్ ప్యాకెట్లు, బియ్యం, చక్కెర, పప్పు ధాన్యాలను వేలాదిమందికి పంచిపెట్టిన పుణ్యాత్మురాలు కీర్తి పట్నాయక్.
అంతేగాక వేడి వేడి భోజనాలు, బిస్కెట్లు, వాటర్ బాటిల్స్, టీ, టిఫిన్స్ ను బాధితులకు, పాదచారులకు బహూకరించారు.
జీవనోపాధి లేక అల్లాడుతున్న
పేదల ఇళ్లకు వెళ్లి ఆహార పొట్లాలు, కిరాణా సామాగ్రి పంచిపెట్టారు.
కరోనా వైరస్ తరుణంలో తమ ఆరోగ్యాల సంగతి చూసుకోకుండా పరిశ్రమించిన
పారిశుధ్య కార్మికులకు, పోలీసులకు, విద్యుత్ ఉద్యోగులకు కూడా సంవత్సరంపాటు భోజనాలను స్వయంగా మోసుకుంటూ వెళ్లి అందజేశారు కీర్తి పట్నాయక్. వేక్సిన్ లను, ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా సరఫరా చేయడంలో, తానే ఒక సైన్యమై కదిలి, మిక్కిలి శ్రమించారు కీర్తి.
ఇటీవల విజయవాడలో పన్నెండు కోలనీలలో వరద బాధితులకు దుప్పట్లు, భోజనాలు, వాటర్ బాటిల్స్, టవల్స్, దుస్తులు, దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేసారు.
అక్కడ ప్రాంతాల్లో గల విద్యార్థులకు బేగులు, పెన్నులు, నోట్సులు, ఏకరూప దుస్తులనందజేశారు.
విశాఖపట్నం ఆర్మీ శిక్షణ కేంద్రాలవద్ద, ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణాల్లో, పెందుర్తి మండలంలో 27గ్రామాల్లో, దువ్వాడ, ఎండాడ, సంతకవిటి, నరసారావుపేట, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో ఏభై వేలకు పైగా మొక్కలు నాటిన ఘనత కీర్తి పట్నాయక్ సొంతం. అంతేగాక ఆ గ్రామాలకు వెళ్లినప్పుడు ఆయా పాఠశాలల్లో బాలబాలికలకు పెన్నులు, బేగ్ లు, పుస్తకాలు, మిఠాయిలను పంచిపెట్టడం కీర్తి యొక్క గొప్పతనాన్ని చాటుతున్నాయి.
పాతిక మంది వృద్దులకు నెలనెలా నిత్యవసర సామగ్రిని అందజేయుట జరుగుతోంది.
మహిళా సాధికారతలో భాగంగా 2500మందికి ఉచితంగా వృత్తి విద్యా కోర్సులను కీర్తియే స్వయంగా శిక్షణనీయడం జరిగింది.
విజయనగరం జిల్లా కొండపాలెం గ్రామం అగ్నిప్రమాదానికి గురైనప్పుడు అందరికంటే ముందుగా వెళ్లి ఏభైకి పైగా కుటుంబాలకు లక్షలాది రూపాయలు ఖర్చుచేసి అన్ని విధాలా ఆదుకొని ఆపద్భాందవులైనారు కీర్తి పట్నాయక్.
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల జైలులో ఖైదీల సౌకర్యార్ధం పెద్ద పరిమాణపు టి.వి.లను ఉచితంగా అందజేసారు.
నర్సీపట్నంలో కుటుంబ కేసులను సమీక్షించి సత్వర పరిష్కారం గావించారు కీర్తి. అలాగే పలు చోట్ల పలుసార్లు సామూహిక సీమంతాల వేడుకలు నిర్వహించి, వారందరికీ చీర గాజులు ఫలతాంబూలాలు పౌష్టికాహారాలను బహూకరించిన ఉత్తమ స్త్రీ మూర్తి కుప్పిలి కీర్తి.
సేవాసంఘ అధినేత్రిగా, సంఘ సంస్కర్తగా నిత్యం కృషిచేస్తున్న కీర్తి సేవలను గుర్తిస్తూ, లండన్ లో హెచ్.ఎస్.సి. యూనివర్సిటీ వారు ఆమెకు సేవారంగంలో డాక్టరేట్ పట్టా ప్రదానం చేసారు. ఇలా అంతర్జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు లభించింది కీర్తికి.
విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్, రైల్వే శాఖ, పలు మండల కార్యాలయాల నుండి ఉత్తమ సంఘ సేవకురాలిగా పురస్కారాలు పొందారు.
అలాగే వందకు పైగా ప్రయివేటు సంస్థల నుండి మహాత్మాగాంధీ పురస్కారం, చత్రపతి శివాజీ అవార్డు, నారీమణి, సేవా తరంగిణి వంటి బిరుదాంకిత సత్కారాలు పొందారు కీర్తి పట్నాయక్.
వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ వారు ఉత్తమ సంఘసంస్కర్తగా కీర్తి పట్నాయక్ కు పురస్కారంతో సన్మానించారు.
భువనేశ్వర్ లో జాతీయ స్థాయి సేవామూర్తి పురస్కారం అందుకున్నారు.
ఆంధ్రా లెజెండ్, అబ్దుల్ కలాం అవార్డు, రాష్ట్ర బి.సి.కార్పోరేషన్ వారిచే మదర్ థెరీసా అవార్డు, విశాఖపట్నం మున్సిపల్ శాఖ వారిచే జీవ వైవిధ్య, మాతా శిశు సంక్షేమ శాఖల నుండి కస్తూర్బా గాంధీ పురస్కారాలను వందలాది పొంది ఎందరికో మార్గదర్శకంగా నిలిచారు కీర్తి పట్నాయక్.
వృద్దులకు అనాధాశ్రమం నిర్మించాలని వారికి సేవలు చేస్తూ ఇతర సేవాకార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోవాలనేది కీర్తి పట్నాయక్ ఆశయంగా చెబుతున్నారు.
ఈ ధరణిలో కీర్తి పట్నాయక్ వంటి తరుణి, యావత్ అతివలజాతికే గర్వకారణంగా నిలిచారనుట అతిశయోక్తి కాదు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి