స్తోత్రేణాలమహం ప్రవచ్మి న మృషా దేవా విరించాదయః
స్తుత్యానాం గణనా ప్రసంగ సమయే త్వా మగ్రగణ్యం విదుః !
మాహాత్మ్యాగ్రవిచారణ ప్రకరణే దా నా తుషస్తోమవ-
ధ్ధూతాస్త్యాం విదురుత్తమోత్తమ ఫలం శంభో భవత్సేవకాః !
భావం: ఓ శంకర! స్తోత్రము చాలు. నేను అబద్ధం చెప్పను. బ్రహ్మ మొదలైన దేవతలు కొని ఆ
యాడదగిన వారిని లెక్కించినప్పుడు నిన్నే మొదట లెక్కింపదగినవానిగా తలచిరి. మహత్మ్యములు గొప్ప వారిని గురించి విచారించుచున్నప్పుడు నీ భక్తులు ఊక తొలగించిన , ఉత్తమోత్తమమైన ధాన్యముగా నిన్ను భావించుచున్నారు.
******
శివానందలహరి;- కొప్పరపు తాయారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి