జాతీయ నూతన విద్యా విధానం పై కస్తూరి రంగన్ కమిటీ ప్రతిపాదన అయిన అన్ని రకాల కోర్సులు,వృత్తి విద్యతో పాటు ఒకే చోట వుండాలన్న సిఫార్సు ఆచరణీయం, ఆమోదయోగ్యమైనది. ఒకే కోర్సును అందించే మూస విధానానికి కళాశాలలు, విశ్వ విద్యాలయాలు స్వస్థి పలికి బహుళ కోర్సులను అందించే వ్యవస్థలుగా మార్పు చెందితే విద్యార్ధులకు ప్రయోజనకరంగా వుంటుందని కమిటీ లోని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్త పరచడం స్వాగతించదగినదే.ప్రస్తుతం వైద్య, న్యాయ,వ్యవసాయ ,సాంకేతిక విద్యలను అందించడానికి ఒక్కొక్క కోర్సుకు ఒక్కొక్క విద్యాలయం వుండడంతో విద్యార్ధులు ఒకే కోర్సుతోనే సరిపెట్టుకోవాల్సి వస్తొంది.పాశ్చాత్య దేశాలలో అయితే ఒక కళాశాల లేక విశ్వవిద్యాలయంలో బహుళ కోర్సులు అందించడం ద్వారా విద్యార్ధులు రెండు మూడు కోర్సులు ఒకే చోట కలిపి పరిశోధన చేయడానికి , వారి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. కాని మన దేశం లో ప్రభుత్వాలకు ముందు చూపు లేకపోవడం,విద్యార్ధులలో అవగాహనా రాహిత్యం, మూస విద్యావిధానం తో బహుళ కోర్సులు అందించే కళాశాలలు, లేక విశ్వవిద్యాలయాలు లేకపోవడం తో విద్యార్ధులు ఒకే కోర్సుకు పరిమితమవుతుండడం తో ప్రపంచ స్థాయి నిపుణులతో పోలిస్తే బహుళ నైపుణ్య సాధనలో మన విద్యార్ధుల వెనుకబాటుతనం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.మన దేశంలోని రమారమి 800 విశ్వవిద్యాలయాలు,40 వేల కళాశాలలను కలిపి 15 వేల నాణ్యమైన , బహుళ కోర్సులు అందించే విద్యాసంస్థలుగా మార్చుకోవాలని కమిటీ ప్రతిపాదించింది.ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే 20 శాతం కళాశాలలు వందమంది కంటే తక్కువ విద్యార్ధులతో,అరకొర సౌకర్యాలతో వనరులు లేక నాణ్యమైన విద్య అందించలేక విద్యార్ధులను చీకటిలో వుంచుతున్న నకిలీ విద్యాసంస్థలు కనుమరుగు అవకతప్పదు.ప్రస్తుతం ఒక్కొక్క కోర్సుకు ఒక నియంత్రణ సంస్థ వుండడంతో ప్రతీ సంస్థకు నియమ నిబంధనలు , విధానాలు వేరుగా వుండడంతో సంస్థల మధ్య ఏకాభిప్రాయం వుండడం లేదు.మన దేశంలో కూడా ఒకే నియంత్రణా సంస్థ వుండి బహుళ కోర్సులతో కూడిన విద్యా సంస్థలు వుంటే మంచిదన్న కమిటీ సిఫార్సు అమలులోకి వస్తే విద్యార్ధులకు అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్యమైన విద్యను అందించవచ్చు.ఇప్పటికే ఐ ఐ టి ఖరగ్పూర్ ఇంజనీరింగ్ తో పాటు వైద్య విద్యను ప్రారంభించడం ఒక శుభ సంకేతం.పరిశోధనా విశ్వ విద్యాలయాలు ఒక వర్గీకరణగా, బోధనా విద్యాలయాలు రెండవ వర్గీకరణగా , బోధనా కళాశాలలు మూడవ వర్గంగా వర్గీకరించి బోధనా వర్సిటీలలో విద్యార్ధుల సంఖ్యను 5 నుండి 25 వేల వరకు మరియు బోధనా కళాశాలలు డిగ్రీ కోర్సులపై దృష్టి పెట్టి స్వయం ప్రతిపత్తి హోదా పొందాల్సి వుంటుందని ఈ కమిటీ ప్రతిపాదనను ప్రభుత్వానికి అందించింది.అనుబంధ కళాశాలలను తీసేసి వర్సిటీలు,డిగ్రీ పట్టాలు ఇచ్చే కళాశాలలే వుండాలని 2020 సంవత్సరం తర్వాత ఇక మరి ఏ కళాశాలలకు అనుమతి నివ్వకుండా నాణ్యమైన విద్యను అందించాలని కమిటీ సఫార్సు చేసింది. ఇంటర్ విద్యతో పాటు నాలుగేళ్ళ ఇంటిగ్రేటెడ్ బి యీ డి కోర్సు ప్రవేశపెట్టాలని అనువాద సమస్య రాకుండా ఉన్నతమైన న్యాయ విద్యను రెండు భాషలలో అందించాలని ఎం ఫిల్ కోర్సును రద్దు చేయాలని ఈ కమిటి ఇచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఎంతవరకు అమలు చేస్తుందో వేచి చూడాల్సి వుంది.
బహుళ ప్రయోజనక వ్యవస్థలుగా భారతీయ విద్యాసంస్థలు:- సి.హెచ్.ప్రతాప్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి