దొరికిన రాము : -జి.చైత్ర-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -రేగులపల్లి
 అనగనగా ఒక ఊరిలో ముగ్గురు స్నేహితులు  ఉండేవారు. వారి పేర్లు సురేష్, రాము,నరేష్ ఒకరోజు  ముగ్గురు స్నేహితులు జాతరకు వెళ్లారు. కానీ అనుకోకుండా ఆ జాతరలో రాము తప్పిపోయాడు. సురేష్ నరేష్ ఇద్దరూ చాలాసేపు రాము కోసం వెతికారు. కానీ రాము దొరకలేదు అప్పుడు ఆ ఇద్దరు స్నేహితులు ఎంతో బాధ పడ్డారు. ఈ విషయం వారి తల్లిదండ్రుల కు చెప్పారు.మరుసటి రోజు కూడా వెతికారు అయినా కానీ రాము దొరకలేదు.పోలీసుల కు కూడా చెప్పారు.ఇట్లా నెలరోజులపాటు వెతికారు అయినా రాము జాడ లభించలేదు. మిగతా ఇద్దరూ స్నేహితులు రాము కోసం ఆలోచిస్తూ చాలా రోజులు బాధపడ్డారు. స్నేహితులిద్దరూ పెరిగి పెద్దవారయ్యారు నరేష్ కి 16 సంవత్సరాలు సురేష్ కి కూడా 16 సంవత్సరాలు నరేష్ సురేష్ లు ఒకరోజు నరేష్ పుట్టిన రోజు సందర్భముగా అనాథ ఆశ్రమంలోని వారికి పండ్లు దానం చేయడానికి  వెళ్లారు. అక్కడ వాళ్ల మిత్రుడు అన్నం తింటూ ఉండగా నరేష్ సురేష్ లకు గుర్తుపట్టారు. అప్పుడు చాలాకాలంగా తప్పిపోయిన తమ మిత్రుడు రాముని గుర్తుపట్టారు.చాలా ఆనందించారు. ఆ రోజు జాతరలో ఎలా తప్పి పోయాడో ఇక్కడికి ఎలా చేరుకున్నడో అడిగి తెలుసుకున్నారు. రాముని అక్కడి నుంచి తీసుకొనిఇంటికి వారి తల్లిదండ్రుల దగ్గర కు తీసుకొని వెళ్లారు.

కామెంట్‌లు